భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త: పిల్లులు దిక్కులేని పక్షులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరబాద్: ఆర్థిక ఇబ్బందులతో పాటు మనస్పర్థలు రావడంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఇద్దరు పిల్లలు కూడా దిక్కులేనివారయ్యారు.ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన హైదరాబాబద్ మలక్‌పేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని ఏనుగుపల్లికి చెందిన సదనపు సుభాష్‌రెడ్డి(45), శోభ (35) దంపతులు జీవనోపాధికి హైదరాబాద్ వచ్చారు. మూసారాంబాగ్‌ బస్తీలో నివసిస్తున్న వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు.

 Husband kills wife after fight, commits suicide

శాలివాహననగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో వైష్ణవి ఐదో తరగతిలో, శ్రీవాణి నర్సరీ చదువుతున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న సుభాష్‌రెడ్డి ఓల్డ్‌మలక్‌పేట మార్కెట్‌లో ఉన్న హోటల్‌లో కార్మికుడిగా కొనసాగుతున్నాడు. మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో భార్య, భర్తల మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి.

 Husband kills wife after fight, commits suicide

ఇలా గొడవ పడ్డారు...

బుధవారం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్త చీరతో భార్యను గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఇనుప దూలానికి తాడు బిగించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్న భోజనానికి పాఠశాల నుంచి పిల్లులు తిరిగి వచ్చారు. తలుపులు మూసి ఉండటంతో ఇంటి యజమానికి విషయం చెప్పారు.

 Husband kills wife after fight, commits suicide

తలుపులు పగులగొట్టి చూడగా...

తలుపులు పగులకొట్టి వెళ్లి చూడగా ఇరువురి మృతదేహాలు కనిపించాయి. శోభ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లింగం రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుభాష్ రెడ్డి రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man allegedly killed his wife and committed suicide at their residence at Malakpet on Wednesday afternoon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X