తలపై దిండుతో అదిమి భార్యను చంపిన భర్త (ఫోటో)
హైదరాబాద్: అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వివరాళ్లోకి వెళితే, ఈస్ట్ కాకతీయ నగర్‌లో నివసించే శ్రీకాంత్ (35), శ్రీకళ (26)ను 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వివాహ సమయంలో అత్తింటి వారు పది తులాల బంగారం, రెండున్నర లక్షలు నగదును కట్నంగా ఇచ్చారు.
వివాహమైన ముడు నెలలకే అదనంగా రెండు లక్షలు తీసుకు రావలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. కోపంతో ఆమె తలపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తన భార్యను కొట్టినట్టు నేరేడ్‌మెట్ పోలీసులకు శ్రీకాంత్ తెలిపాడు.

సోమవారం ఉదయం పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకోగా శ్రీకళ మృతి చెంది ఉంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కూతురిని అల్లుడే చంపాడని మృతురాలు తల్లి యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications