అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపేశాడు (ఫోటోలు)
హైదరాబాద్: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు. సుత్తెతో మోది, బండరాయితో బాది అత్యంత దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని చెట్లపొదల్లో పడేసి వెళ్తుండగా స్ధానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల పరిధిలోని రాంపలి దాయరలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం కీసర మండల పరిధిలోని కీసరదాయరకు చెందిన వడ్డెరి రాములు మొదటి భార్య గతంలో ఆయన్ని వదిలేసి వెళ్లింది. దీంతో అతడు కందుకూరు మండలానికి చెందిన చంద్రమ్మ (48)ను రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా రాములు భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపేశాడు
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా చంద్రమ్మ పుట్టింట్లోనే ఉంది. మూడు రోజుల క్రితం రాములు భార్యను కీసరదాయర తీసుకొచ్చాడు. గురువారం ఉదయం రాంపల్లిదాయర గ్రామ సమీపంలో ఉన్న ఎంకిలోనిగుట్ట సమీపంలో కంకర కొట్టేందుకు ఆయన భార్య చంద్రమ్మను వెంట తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది.

అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపేశాడు
అప్పటికే అనుమానంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న రాములు తన చేతిలో ఉన్న సుత్తెతో చంద్రమ్మ తలపై మోదాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేసి కుప్పకూలిపోయింది. వెంటనే పక్కనే ఉన్నన గ్రానైట్ రాయితో ముఖంపై బాదాడు. దీంతో చంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహన్ని పక్కనే చెల్లపొదల్లోకి తీసుకెళ్లాడు.

అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపేశాడు
మృతదేహంపై చెట్ల కొమ్మలు వేసి పరారవుతుండగా, సమీపంలో ఉన్న రైతులు అక్కడికి వచ్చారు. ఇక్కడ ఓ మహిళ కేకలు వినిపించాయని రాములను ప్రశ్నించారు. మొదటగా రాములును రైతులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పాడు. ఆగ్రాహానికి గురైన రైతులు రాములును చితకబాది పోలీసులకు సమచారం అందించారు.

అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా సుత్తితో మోది చంపేశాడు
సీఐ గురువారెడ్డి, ఎస్ఐలు విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెట్ల పొదల్లోంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రాములను ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications