కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతరబంధం, భార్య వేధింపులు: కలెక్టరేట్ ఎదుట భర్త ఆందోళన

|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: తనను భార్య వేధింపుల నుంచి కాపాడాలంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టాడు. పెద్దలు చెప్పిన వినకుండా ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కొద్ది రో జులకే తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వాపోయాడు.

అంతేగాక, తనని వేధింపులకు గురిచేస్తోందని.. న్యాయం చేయండంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. చొప్ప దండి మండలం చాకుంటకు చెందిన శ్రీనివాస్‌చారి, రుక్మాపూర్‌కు చెందిన లావణ్య 2015లో వివా హం చేసుకున్నారు.

husband protests at collectorate due to wife harassment

అయితే, కొన్నిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రుక్మాపూర్‌ సర్పంచ్‌ కర్రె శ్రీనివాస్‌ వద్ద పంచాయితీ జరిగింది. ఇదే అదునుగా సర్పంచ్‌ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాస్‌చారి ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చొప్పదండి పోలీసుస్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

కేసు విత్‌డ్రా చేసుకోమని చెప్పడంతో మానవతా దృక్పథంతో విత్‌డ్రా చేసుకున్నప్పటికీ ఆమెలో ఎలాంటి మా ర్పు రాలేదన్నారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌తోపాటు ఆమె బావ తిరుపతి ఎస్సీ, ఎస్టీ, వరకట్నం కేసులు పెడుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు. బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

English summary
A man protested at Karimnagar collectorate due to wife harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X