హుజురాబాద్ లో ఉపఎన్నిక ఇప్పుడు అనుమానమేనా.. కేసీఆర్ కొత్త ప్లాన్ ఇదేనా ? తెరపైకి కొత్త చర్చ
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతుందా ? హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హోరాహోరీగా అధికార ప్రతిపక్ష పార్టీలు తలపడుతున్నా హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోందా ? గతంలో ఎన్నడూ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎదురుకాని పరిస్థితులు అధికార పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికకు ఎదురవుతున్నాయా ? ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం అనుమానమే అన్న భావన వ్యక్తమవుతుందా ? అందుకు తాజాగా హుజురాబాద్ నియోజక వర్గంలో అధికారుల పర్యటన అందుకు కారణమా? అంటే అవును అనే టాక్ నియోజక వర్గంలో జోరుగా వినిపిస్తోంది.

హుజురాబాద్ లో కరోనా పెరుగుతుందని చెప్పిన హెల్త్ డైరెక్టర్
హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడుతుందని వార్తలు వస్తున్న సమయంలో హుజురాబాద్ లో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టిసారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హుజురాబాద్ లో పరిస్థితులను పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ డాక్టర్. శ్రీనివాసరావు హుజురాబాద్ లో పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడిలోనే ఉన్నా హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఎన్నికల కమీషన్ కు కరోనా కేసుల పెరుగుదల నివేదిక ఇచ్చే ఛాన్స్ !
అంతకు ముందు నాలుగు వారాల క్రితం కూడా హుజురాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైద్య ఆరోగ్యశాఖ బృందం అక్కడ పర్యటించి కరోనా పరిస్థితులను పరిశీలించింది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్న మాటలను బట్టి, ఎన్నికల కమిషన్ కు ఇదే నివేదికను పంపిస్తే హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.

హుజురాబాద్ లో పట్టు కోసం సీఎం కేసీఆర్ వ్యూహాలు .. అయినా ప్రతికూలత ఉందా ?
ఇప్పటికే సీఎం కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గంపై పట్టుకోసం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చూపించడమే కాకుండా, నిధుల వరద కురిపిస్తున్నారు. ఇక తాజాగా దళిత బంధు కోసం హుజురాబాద్ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. దళిత ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారని, దళితులు ఎవరు మోసపోవద్దని, టిఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చిన, మరే రకమైన లబ్ధి చేకూర్చినా తీసుకొని తనకు ఓటు వేయాలని బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉపఎన్నిక జరిగినా ఎదురుకాని పరిస్థితి హుజురాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు ఎదురవుతుంది.

హుజురాబాద్ నియోజకవర్గంపై ఆసక్తి .. సర్వేల్లో ఈటల కే మొగ్గు !!
తాజాగా ప్రతిపక్ష పార్టీలు దూకుడు చూపించటం, ఈటల రాజేందర్ వంటి నేత కేసీఆర్ ను విబేధించటంతో తెలంగాణ ప్రజల ఆసక్తి ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం పైన పడింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్టుగా హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితి ఉంది. ఈ క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నదానిపై, ఎవరికి వారు సర్వేలు నిర్వహించడమే కాకుండా, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సర్వే నిర్వహించారని సమాచారం. అయితే ఈటల రాజేందర్ కే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లుగా సర్వే ఫలితాలు వచ్చాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో సీఎం కేసీఆర్ మరింత ఫోకస్ హుజురాబాద్ నియోజకవర్గం మీద పెట్టి వందల కోట్ల రూపాయలను హుజూరాబాద్ నియోజకవర్గం కోసం ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో తప్ప విడి రోజుల్లో ప్రజా క్షేత్రంలోకి రాని సీఎం కేసీఆర్ పర్యటనలు మొదలుపెట్టారు .

గులాబీ పార్టీకి అనుకూలంగా లేకుంటే ఉప ఎన్నిక వాయిదా ప్లాన్
అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించకుంటే, అధికార పార్టీకి అనుకూలంగా మారకుంటే, హుజురాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసే అవకాశం కూడా లేకపోలేదని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది అన్న పాజిటివ్ సంకేతాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆ పరిస్థితులను మార్చడానికి కరోనాని ఆయుధంగా ఉపయోగించనున్నట్లు గా తాజా హెల్త్ డైరెక్టర్ పర్యటన ద్వారా బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ పరిస్థితి తనకు పాజిటివ్ గా ఉంటే ఎన్నికలకు ముందుకు వెళతారని, లేదంటే కరోనా సాగుతో ఎన్నికలను వాయిదా వేసేలా తదనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారని స్థానికంగా చర్చిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులపై ప్రధాన దృష్టి.. అధికారుల పర్యటనలు అందుకే
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో కరోనా కేసులు పెరిగినా వెళ్ళని హెల్త్ డైరెక్టర్ , ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కేసులు పెరిగితే పర్యటన మీద పర్యటనలు చేస్తున్నారని, ఇదంతా కేవలం ఎన్నికల కమిషన్ కు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా కేసులు మరింత పెరుగుతాయని చెప్పే ఉద్దేశంతోనేనని జోరుగా నియోజకవర్గ ప్రజలు చర్చిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ తో తల పడడానికి ఒకరు కాదు ఎనిమిది మంది మంత్రులు రంగంలోకి దిగి మండలాల వారీగా పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తున్నారు. ఈటల ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలను సంధిస్తున్నారు. కేసీఆర్ తోనే అభివృద్ధి అంటూ ఊదర గొడుతున్నారు.

హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ .. లేదంటే ఎన్నికలే వాయిదా వ్యూహం
టిఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున హుజూరాబాద్ నియోజకవర్గం లో దృష్టిసారించడం వెనుక ఈటల స్థానికంగా శక్తివంతుడు అన్న భయం గులాబీ అధినేత కేసీఆర్ కు ఉన్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి కేసీఆర్ సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించడానికి వెనుకాడబోరని స్థానికంగా చర్చ జరుగుతోంది. గతంలో ఎక్కడా ఎదురుకాని ఎదురుగాలి ఈ సారి సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ లో ఎడురయ్యేలా ఉంది. అందుకే వ్యూహం మారుస్తారేమో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.
Recommended Video

ఉప ఎన్నిక వాయిదాపై బీజేపీ అనుమానం ..స్థానికంగా చర్చ
అభివృద్ధి చేస్తున్నామని చూపిస్తూ ప్రజలను ఆకట్టుకోవడం, హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టడానికి వ్యూహాలను రచించడం, బిజెపిలో ముఖ్య నాయకులు తమ పార్టీలోకి మార్చుకునే ప్రయత్నం చేయడం, ఇష్టారాజ్యంగా డబ్బు ఖర్చు పెట్టడం వంటి అనేక ప్రయోగాలు చేస్తున్నారని బీజేపీ శ్రేణులు చర్చిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితులు తమకు అనుకూలంగా మారకుంటే ఎన్నికలను ప్రస్తుతానికి వాయిదా వేయడానికి కూడా తగిన విధంగా సీఎం కేసీఆర్ సమాయత్తమయ్యాడు అని నియోజకవర్గంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ డిబేట్ నడుస్తోంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications