Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాయ్ రాజా కాయ్.. హుజురాబాద్ పై ఏపీ బెట్టింగ్ రాయుళ్ళ దృష్టి; జోరుగా వందల కోట్ల బెట్టింగ్ లు !!

హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నారు టీఆర్ఎస్ బీజేపీ నేతలు. ఒకరిని మించి ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో హుజురాబాద్ ఎన్నికల రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కెసిఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి.

హుజురాబాద్ లో వందల కోట్ల రూపాయల బెట్టింగ్

హుజురాబాద్ లో వందల కోట్ల రూపాయల బెట్టింగ్

వందల కోట్ల రూపాయల బెట్టింగ్ హుజురాబాద్ ఉప ఎన్నికపై జరుగుతుందని తెలుస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది అన్నదానిపై నియోజకవర్గం లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈటల రాజేందర్ గెలుస్తారని కొందరు, లేదు టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని ఓట్లు వస్తాయో అంచనాలు వేసి మరీ పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై ఆన్లైన్ లోనూ రహస్యంగా బెట్టింగ్ కొనసాగుతుంది. ఇక ఆఫ్ లైన్ బెట్టింగ్ ల మాట అయితే చెప్పనలవి కాకుండా ఉంది. కాయ్ రాజా కాయ్ అంటూ హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపోటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి.

తెలంగాణా నుండే కాక ఏపీలోనూ హుజురాబాద్ పై బెట్టింగ్ లు

తెలంగాణా నుండే కాక ఏపీలోనూ హుజురాబాద్ పై బెట్టింగ్ లు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లతో పాటుగా వివిధ రాష్ట్రాల వాళ్లు కూడా హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక గత నెల నుంచి బెట్టింగులు మొదలు కాగా, పోలింగ్ కు గడువు సమీపించడంతో నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో బెట్టింగులు జోరందుకున్నాయి. హుజురాబాద్లో బెట్టింగ్ ల విలువ వంద కోట్లకు పైగానే దాటినట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్లైన్ లోనే దందా సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా, ఇక మహారాష్ట్రకు చెందిన నాందేడ్, ముంబై, షోలాపూర్ వంటి ప్రాంతాల వారు కూడా బెట్టింగ్ లలో పాల్గొంటున్నట్టు సమాచారం.

ఏపీ నాయకులు హుజురాబాద్ లో ..

ఏపీ నాయకులు హుజురాబాద్ లో ..

ఇక ఆంధ్ర నాయకులు తెలంగాణలో జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. కొందరు నాయకులు అయితే హుజురాబాద్ వెళ్లి మరీ అక్కడ ట్రెండ్ గురించి తెలుసుకుంటున్నారు. మొన్నటి వరకు ఐపీఎల్ బెట్టింగ్ లలో పాల్గొన్నవారు ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టి బెట్టింగ్ లలో పాల్గొంటున్నారు. రూపాయికి పది రూపాయలు, కొన్ని చోట్ల రూపాయికి వెయ్యి రూపాయలు ఇలా కోట్లాది రూపాయల బెట్టింగ్ హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతుంది.

 ఉప ఎన్నిక పూర్తయ్యే సరికి దాదాపు మూడు వందల కోట్ల మేర బెట్టింగులు

ఉప ఎన్నిక పూర్తయ్యే సరికి దాదాపు మూడు వందల కోట్ల మేర బెట్టింగులు

హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేసరికి దాదాపు మూడు వందల కోట్ల మేర బెట్టింగులు జరుగుతాయని భావిస్తున్నారు. ఏదిఏమైనా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం ఎవరిది అన్నదానిపై జరుగుతున్న చర్చలు, పెడుతున్న బెట్టింగులు చూస్తే ఈ ఎన్నికకు ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో అర్థమవుతుంది. ఇక ఈటల రాజేందర్ గెలుస్తాడని బెట్టింగులు కట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎవరికి విజయం చేకూరుస్తారు అనేది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+