వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ లో జోరుగా డబ్బులు పంచే వీడియోలు వైరల్: ఈసారి బీజేపీ వంతు; ఓటుకు 10 వేలు, జోరుగా చర్చ

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, ఈటల రాజేందర్ హోరాహోరీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ లు పెద్ద ఎత్తున ప్రచారం సాగించాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ కు, బిజెపికి మధ్యనే ప్రధాన పోటీ ఉండగా సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు ఈ రెండు పార్టీల మధ్యనే జోరుగా సాగాయి.

కాయ్ రాజా కాయ్.. హుజురాబాద్ పై ఏపీ బెట్టింగ్ రాయుళ్ళ దృష్టి; జోరుగా వందల కోట్ల బెట్టింగ్ లు !!కాయ్ రాజా కాయ్.. హుజురాబాద్ పై ఏపీ బెట్టింగ్ రాయుళ్ళ దృష్టి; జోరుగా వందల కోట్ల బెట్టింగ్ లు !!

 హుజురాబాద్ లో ప్రలోభాల పర్వం .. పోల్ మేనేజ్ మెంట్ పై ప్రధానంగా దృష్టి

హుజురాబాద్ లో ప్రలోభాల పర్వం .. పోల్ మేనేజ్ మెంట్ పై ప్రధానంగా దృష్టి


హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుంది. అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్ కు చేరుకుంది. పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే నియోజకవర్గంలో మద్యం ఏరులై ప్రవహిస్తుంది. ఇక డబ్బు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీనే అని భావిస్తున్న తరుణంలో ఒక్క ఓటు కూడా రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ క్రమంలో అవసరం అనుకుంటే ఓటుకు 20,000 వరకు అధికార టీఆర్ఎస్ ఇస్తుందని స్థానికంగా చర్చ జరుగుతుంది .

 బీజేపీ డబ్బులు పంచే వీడియోలు వైరల్.. ఓటుకు 10 వేల రూపాయలు

బీజేపీ డబ్బులు పంచే వీడియోలు వైరల్.. ఓటుకు 10 వేల రూపాయలు


ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ నేతలు కూడా డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్ గా మారాయి. ఓటుకు 10 వేల రూపాయలు ఈటల రాజేందర్ ఫోటో, కమలం గుర్తు ముద్రించిన కవర్ లో ఒక మహిళకు ఇచ్చినట్టు, ఇద్దరు మహిళలు దీనిపై మాట్లాడుకుంటున్నట్టు ఆ వీడియో లో ఉంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇవి నిజంగా జరుగుతున్న నగదు పంపిణీకి సంబంధించిన వీడియోలా ? లేకా ఫేక్ వీడియోలు సృష్టించి ప్రత్యర్ధి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే కావాలనే టీఆర్ఎస్ పార్టీ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిన్న నగదు పంచి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీఆర్ఎస్ పార్టీ కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు.

టీఆర్ఎస్ నగదు పంచే వీడియోలు వైరల్ కావటంతో బీజేపీ ఆరోపణలు

టీఆర్ఎస్ నగదు పంచే వీడియోలు వైరల్ కావటంతో బీజేపీ ఆరోపణలు

తాజాగా టీఆర్ఎస్ పార్టీ డబ్బులు జోరుగా పంచుతుందని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరిసేడు, ఇల్లంతకుంట మండలంలో కవర్లలో పెట్టి మరీ డబ్బులు పంపిణీ జరుగుతుందని ప్రచారం సాగింది. ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉంటే అంత కవర్ పై సంఖ్య వేసి అందులో ఒక్కొక్క ఓటుకు ఆరు వేల చొప్పున పంపిణీ జరుగుతోందని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న నగదు పంపిణీగా చెప్తున్నారు.

ముఖాలు కనిపించకుండా నగదుకు సంబంధించి వీడియోలపై అనుమానం

ముఖాలు కనిపించకుండా నగదుకు సంబంధించి వీడియోలపై అనుమానం

ఇక తాజాగా బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని వీడియో వైరల్ గా మారటంతో ఓటర్లను బీజేపీ నేతలు ప్రలోభ పెడుతున్నారని పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. ఓటుకు 10 వేలు చొప్పున ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని తేల్చి చెప్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ముఖాలు కనిపించకుండా తీసిన ఈ వీడియోలు కావాలని సృష్టించి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని చెప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో వందల కోట్ల నగదు పంపిణీపై ఆరోపణలు తప్ప ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్న దాఖలాలు కూడా లేకపోవటం గమనార్హం.

 ఎన్నికల కమీషన్ అధికారులు ఏం చేస్తున్నారు ?

ఎన్నికల కమీషన్ అధికారులు ఏం చేస్తున్నారు ?

దీనిపై అధికార పార్టీ వోటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుందని బిజెపి ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నేతలు వందల కోట్ల రూపాయలు పంచుతున్నారని, ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆసక్తికరంగా మారాయి. ఇంతా జరుగుతున్నా ఎన్నికల కమీషన్ అధికారులు ఏం చేస్తున్నారు అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎన్నికల సరళిని పర్యవేక్షించే అధికారులు హుజురాబాద్ ఉప ఎన్నిక బెట్టింగ్ లపై, నగదు పంపిణీ, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని చర్చ జరుగుతుంది.

 హుజురాబాద్ లో డబ్బు పంపిణీపై ఆసక్తి .. డబ్బులు తీసుకున్నా ఓట్లేస్తారా?

హుజురాబాద్ లో డబ్బు పంపిణీపై ఆసక్తి .. డబ్బులు తీసుకున్నా ఓట్లేస్తారా?


ఏది ఏమైనా గతంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా హుజురాబాద్ లో ఉప ఎన్నిక పోరులో నగదు పంపిణీ ఆసక్తికరంగా మారింది. టిఆర్ఎస్ బాస్ కెసిఆర్ ఈటల రాజేందర్ ను ఓడించాలని హుజురాబాద్ నియోజకవర్గంపై గత ఆరు నెలలుగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్ ఆయన రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకం చెయ్యటం కోసం హుజురాబాద్ లో నిధుల వర్షం కురిపించారు. వందల కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గం కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడటంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో నోట్ల పండుగ సాగుతుంది. ఏ పార్టీ డబ్బులు పంచినా ఓటర్లు తమకే ఓటు వేస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

English summary
In the Huzurabad by-election, the video of cash distribution of TRS went viral, while the latest video of the BJP giving 10k for vote went viral. It seems that they are giving six thousand to 20 thousand rupees per vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X