వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజురాబాద్ వార్: బీజేపీకి ఓటేస్తే .. బండి సంజయ్, ఈటలకు బాల్క సుమన్ సూటి ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. ఈ ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారటంతో రాష్ట్రం దృష్టి హుజురాబాద్ ఎన్నికలపైనే ఉంది. ఈనెల 30వ తేదీన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు బిజెపిని టార్గెట్ చేస్తున్నారు.

 కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాల్క సుమన్

కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాల్క సుమన్


తాజాగా కమలాపూర్ మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఈటల రాజేందర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలోని గుండెడు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ఈటల రాజేందర్ పై విరుచుకుపడ్డారు. ఈటెల రాజేందర్ రాజీనామాకు కారణం ఏమిటని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో ప్రజలకు చెప్పాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు.

ఈటల రాజీనామా చేసింది ఎందుకు ? సెటైర్లు వేసిన బాల్క సుమన్

ఈటల రాజీనామా చేసింది ఎందుకు ? సెటైర్లు వేసిన బాల్క సుమన్


ఇదే సమయంలో బిజెపి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు బాల్క సుమన్. ఈటల రాజేందర్ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాజీనామా చేశారా? రైతుల జీవితాలను నాశనం చేస్తున్న కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలలో మార్పు కోసం రాజీనామా చేశారా ? అంటూ ప్రశ్నించిన బాల్క సుమన్ ఎస్సి, బిసి పేదల భూములు అక్రమంగా కబ్జా చేశారు, కాబట్టే ఈటల రాజేందర్ రాజీనామా చేశారంటూ ద్వజమెత్తారు. పేద ప్రజలను కొట్టి బలవంతంగా దౌర్జన్యంగా బెదిరించి భూములను లాక్కుంటే, ఆ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనను మంత్రి పదవి నుండి తొలగించారని పేర్కొన్నారు.

ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టని ఈటల తన కోసం హైదరాబాద్ లో ఫాం హౌస్

ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టని ఈటల తన కోసం హైదరాబాద్ లో ఫాం హౌస్

ఇప్పుడు తన ఆస్తులను కాపాడుకోవడం కోసం ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని, మధ్యంతరంగా ఇప్పుడు ఎన్నికలు రావడానికి కారణం ఇదేనంటూ బాల్క సుమన్ పేర్కొన్నారు. ప్రజలకు తాను చేసిన అన్యాయాన్ని మరిచిపోయి ఈటల ఎన్నికల ప్రచారం చేస్తున్నారని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఈటలకు కేసీఆర్ ను నిందించే హక్కు లేదన్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఆయన హుజురాబాద్ లో ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా కట్టలేదని, కానీ హైదరాబాద్ లో పెద్ద ఫాంహౌస్ కట్టుకున్నారని ఈటల రాజేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు బాల్క సుమన్.

బీజేపీకి ఓటేస్తే బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న బాల్క సుమన్

బీజేపీకి ఓటేస్తే బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న బాల్క సుమన్


ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. బిజెపికి ఓటు వేస్తే బండి సంజయ్ ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు అడుగుతున్న ఈటల రాజేందర్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలంటూ బాల్క సుమన్ నిలదీశారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణమవుతుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ, బిజెపి చావో రేవో తేల్చుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

English summary
Government whip Balka Suman slams etela rajender, who was involved in the TRS party's Huzurabad by-election campaign in Kamalapur. Balka suman questioned what was done by bandi sanjay till now ? and what will happen with etela rajender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X