ఊపిరున్నంత వరకు ఉద్యమం: ఢిల్లీ ధర్నాలో కవిత(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటూ తెలంగాణ న్యాయవాదులు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా నిర్వహించారు. కాగా, వీరికి తెలంగాణ ఎంపీలే కాకుండా వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా మద్దతుగా నిలిచి ధర్నాకు సంఘీభావం తెలిపారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంపై వత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.

ఊపిరున్నంతవరకు ఉద్యమిస్తామని ఎంపీ కవిత వ్యాఖ్యానించగా ఇద్దరు సీఎంలతో మాట్లాడి హైకోర్టు విభజన ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోడీ సత్వర నిర్ణయం తీసుకోవాలని ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. 'ఆంధ్ర జడ్జీలు గో బ్యాక్' అంటూ తెలంగాణ న్యాయవాదులు నినదించారు. హైకోర్టు ఏర్పాటు కాకుండా సంపూర్ణ తెలంగాణగా భావించలేమని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. వర్షం సైతం న్యాయవాదుల పట్టుదలను నిలువరించలేకపోయింది.

సుమారు 1500 మంది లాయర్ల ఆందోళనతో జంతర్‌మంతర్ దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. తెలంగాణలోని పది జిల్లాల బార్ అసోసియేషన్‌లకు చెందిన న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సభ్యులు ఈ ధర్నాకు హాజరై హైకోర్టును తక్షణమే విభజించాలని, రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్ర కుట్రలతోనే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్నదని మండిపడ్డారు. ఆంధ్ర కుట్రల్ని ఛేదిద్దాం - స్వంత హైకోర్టును సాధిద్దాం అనే నినాదాలిచ్చారు. ప్రత్యేక హైకోర్టుకు చంద్రబాబునాయుడే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా హైకోర్టు విభజనలో ఏపీ సంకెళ్ళు తమను వెంటాడుతున్నాయని చాటేందుకు న్యాయవాదులు సంకెళ్లతో ప్రదర్శన జరిపారు.

చివరకు హైకోర్టును వెంటనే విభజించాలని, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రూపొందించిన ప్రొవిజినల్ లిస్టును ఉపసంహరించుకోవాలని, జడ్జీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఈ మహాధర్నాలో తీర్మానాలు ఆమోదించారు.

ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ప్రధానితోనూ సీఎం కేసీఆర్ దీని గురించి చర్చించారని, త్వరలోనే పరిష్కారం రాకపోతే రాష్ట్రాన్ని సాధించుకున్నట్టుగానే హైకోర్టునూ సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. పదిహేనేండ్ల తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో లాయర్ల పాత్ర చాలా గొప్పదని ఎంపీ కవిత అన్నారు.

ఊపిరున్నంతవరకు ఉద్యమం చేయడం తెలంగాణ స్వభావమని, హైకోర్టును సాధించుకునేంత వరకూ ఉద్యమిద్దామని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని, డీజీపీ కార్యాలయాన్ని, వివిధ విభాగాల కార్యాలయాలను నిర్వహించుకుంటున్నప్పుడు హైకోర్టును మాత్రం ఎందుకు నిర్వహించుకోకూడదని ఎంపీ వినోద్ ప్రశ్నించారు.

చట్టానికి స్వల్ప సవరణ చేయడం ద్వారా హైకోర్టును వెంటనే విభజించవచ్చని, రాజ్యాంగానికి సవరణలు చేయాల్సిన అవసరంలేదని తెలిపారు. చంద్రబాబు వల్లనే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్నదని, ఇప్పటికైనా ప్రధాని మోడీ చొరవ తీసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి వీలైనంత త్వరగా హైకోర్టును విభజించి ఏపీకి సొంత హైకోర్టును ఏర్పాటు చేయాలని అన్నారు.

రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు తయారీ క్రమంలో కాంగ్రెస్ తీవ్ర వత్తిడికి గురైందని, బిల్లుకు స్పష్టత ఇవ్వడంలో కొంత పొరపాటు జరిగిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అంగీకరించారు. ఇప్పుడు దిద్దుబాటుకు కేంద్రంపై వత్తిడి తెస్తామని చెప్పారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటూ తెలంగాణ న్యాయవాదులు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా నిర్వహించారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

వీరికి తెలంగాణ ఎంపీలే కాకుండా వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా మద్దతుగా నిలిచి ధర్నాకు సంఘీభావం తెలిపారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంపై వత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

ఊపిరున్నంతవరకు ఉద్యమిస్తామని ఎంపీ కవిత వ్యాఖ్యానించగా ఇద్దరు సీఎంలతో మాట్లాడి హైకోర్టు విభజన ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోడీ సత్వర నిర్ణయం తీసుకోవాలని ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

‘ఆంధ్ర జడ్జీలు గో బ్యాక్' అంటూ తెలంగాణ న్యాయవాదులు నినదించారు. హైకోర్టు ఏర్పాటు కాకుండా సంపూర్ణ తెలంగాణగా భావించలేమని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. వర్షం సైతం న్యాయవాదుల పట్టుదలను నిలువరించలేకపోయింది.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

సుమారు 1500 మంది లాయర్ల ఆందోళనతో జంతర్‌మంతర్ దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కూకట్‌పల్లి బార్ అసోసియేషన్‌కు చెందిన చిన్నవీరయ్య అనే న్యాయవాది సొమ్మసిల్లి పడిపోవడంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

తెలంగాణలోని పది జిల్లాల బార్ అసోసియేషన్‌లకు చెందిన న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సభ్యులు ఈ ధర్నాకు హాజరై హైకోర్టును తక్షణమే విభజించాలని, రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

ఆంధ్ర కుట్రలతోనే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్నదని మండిపడ్డారు. ఆంధ్ర కుట్రల్ని ఛేదిద్దాం - స్వంత హైకోర్టును సాధిద్దాం అనే నినాదాలిచ్చారు. ప్రత్యేక హైకోర్టుకు చంద్రబాబునాయుడే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా హైకోర్టు విభజనలో ఏపీ సంకెళ్ళు తమను వెంటాడుతున్నాయని చాటేందుకు న్యాయవాదులు సంకెళ్లతో ప్రదర్శన జరిపారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

తెలంగాణ ఆటపాటలు, ధూంధాంలతో తెలంగాణకు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని, ఆంధ్ర పెత్తనాన్ని పాటల రూపంలో వినిపించారు.

ఢిల్లీ మహా ధర్నా

ఢిల్లీ మహా ధర్నా

ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేస్వరరెడ్డి, సీతారం నాయక్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, రాపోలు ఆనందభాస్కర్ పాల్గొని న్యాయవాదులకు మద్దతు పలికారు. వీరితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ న్యాయశాఖమంత్రి సోమనాథ్ భారతి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The protests for bifurcation of Hyderabad High Court have reached Delhi. Telangana Advocate JAC and Bar council members called for a protest on Monday at Jantar Mantar. Close to 1500 advocates from 10 districts of Telangana are participating in the dharna.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి