వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెగ్గింగ్ పై వార్.. : నకిలీ భిచ్చగాళ్లకు మేయర్ చెక్

|
Google Oneindia TeluguNews

హైదారాబాద్ : హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ కొద్దిసేపు నిలుచున్నా సరే.. వాళ్ల మీద బెగ్గింగ్ దండయాత్ర మొదలైపోవడం ఖాయం. పర్స్ నిల్ అని చెప్పినా.. చిల్లర లేవని కసురుకున్నా.. ఒక పట్టాన వదలరు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. వెంబడించి మరీ చిల్లర వసూలు చేయించుకుంటారు. అలా ఒక్కరా.. ఇద్దరా.. ఏ సెంటర్ దగ్గర నిలబడ్డ ఇదే భాగోతం..

సరిగ్గా ఇదే సమస్యపై ఫోకస్ చేసిన నగర మేయర్ బొంతు రామ్మోహన్.. నగరాన్ని బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే బెగ్గింగ్ కి సంబంధించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన ఆయన నగరంలో భిచ్చగాళ్లకు చెక్ పెట్టడానికి సిద్దమయ్యారు.

నగరంలో భిచ్చగాళ్లకు ఇకనుంచి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దంటూ ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు మేయర్ బొంతు రామ్మోహన్. నిజమైన భిచ్చగాళ్లకు పునరావాసం కల్పిస్తామని గతంలో ప్రకటించిన ఆయన, నగరంలో నిజమైన భిచ్చగాళ్లు గ్రేటర్ పరిధిలో తమ పేరును నమోదు చేయించుకోవాలని.. మార్పుకు సహకరించాలని ఫ్లెక్సీ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.

బెగ్గింగ్ లో ఇంత సంపాదనా..! : కళ్లు బైర్లు కమ్మాల్సిందే..బెగ్గింగ్ లో ఇంత సంపాదనా..! : కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Hyd mayor steps to begging free city

ఇందుకోసం 9908111355 9441746906 9866289793 ఫోన్ నంబర్లను కూడా ప్రత్యేకంగా భిచ్చగాళ్ల కోసమే ఏర్పాటు చేసిన మేయర్, అసలైన భిచ్చగాళ్లు ఆ నంబర్లలో సంప్రదించి తమ వివరాలు నమోదు చేయించుకుంటే, స్వచ్చంద సంస్థల ద్వారా పునారావాసం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు.

ఇదే విషయంపై గ్రేటర్ ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకు నగరం నలుమూలలా 'భిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వవద్దు' అన్న బ్యానర్లను ఏర్పాటు చేయించబోతున్నట్టు సమాచారం. చూడాలి మరి మేయర్ బొంతు రామ్మోహన్ చేస్తున్న బెగ్గింగ్ ఫ్రీ సిటీ ప్రయత్నం ఎంతమేర సక్సెస్ అవుతుందో.

English summary
Hyd mayor Bontu Rammohan started the actions to make city as begging free. In this process the mayor released a banner that the matter about dont give the money to beggers and dont encourage them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X