హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం, బలవంతంగా.. హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్ హల్‌చల్(వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో బుధవారం నాడు జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో, వాట్సప్‌లో హల్‌చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పల్ నల్ల చెరువు కట్టపై పండ్లు, వేరుశనక్కాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారుల పైన హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడ్డారు. తోపుడు బండ్లు, బుట్టల్లోని పండ్లు, వేరుశనక్కాయలను చెల్లాచెదురు చేయడంతో పాటు వాటిలో కొన్నింటిని తమ వాహనంలోకి ఎక్కించారు.

తాము చిన్న వ్యాపారులమని బాధితులు పోలీసులను బతిమాలారు. అయినా వారు కనికరించలేదు. దీనిని గమనించిన గుర్తు తెలియని యువకుడు వెంటనే తన మొబైల్ ఫోన్లో ట్రాఫిక్ పోలీసుల తీరును వీడియో తీశాడు. అనంతరం దానిని వాట్సప్‌లో పోస్ట్ చేశాడు.

Video Credits: IBNLive

ప్రస్తుతం ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. దీంతో పోలీసులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్న కారణంగానే చిన్న వ్యాపారులను అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ జానకి రెడ్డి వివరణ ఇచ్చారు.

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి కూరగాయల బుట్టాను తీసుకెళ్తున్నట్లుగా వీడియో ఉంది. అతను పోలీసులను బతిమాలాడు. అయినప్పటికీ వినలేదు. బలవంతంగా వాటిని తమ వాహనంలో ఎక్కించారు. అయితే, అక్కడ పెద్దగా ట్రాఫిక్ జాం అంతగా ఉండదని, పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

English summary
In a shocking incident, A policeman caught on camera while snatching a basket full of vegetables from roadside vendor at Uppal on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X