అక్రమంగా భారత పౌరసత్వం: ముగ్గురు రోహింగ్యాల అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్: భారత పౌరసత్వం పొందినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మయన్మార్ దేశస్థుల(రోహింగ్యా ముస్లింల)ను బాలాపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఎల్బీనగర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ నసీమ్(49), సలీమా బేగం(48) దంపతులకు మహ్మద్ యూనస్(25), ఇస్మాయిల్ అనే కుమారులున్నారు. మన దేశానికి శరణార్థులుగా వచ్చిన వీరు బాలాపూర్ సమీపంలోని షహీన్‌నగర్‌బిస్మిల్లా కాలనీలో ఉంటూ భారత పౌరసత్వాన్ని పొందేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.

స్థానికంగా ఉండే ఖతీజా, మహ్మద్ ఖాలిక్‌లు మహ్మద్ యూనస్‌కు అక్కడి క్రిసెంట్ స్కూల్‌లో చదివినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్ అందజేశారు. దాని ఆధారంగా ఆధార్, ఓటరు, పాన్, డ్రైవింగ్ లైసెన్సు, ఎస్‌బీఐ బ్యాంకు అకౌంటు, జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు అక్రమంగా తయారుచేయించి అతనికి పాస్‌పోర్టును ఇప్పించారు.
అంతేగాక, కుటుంబ సభ్యులు సైతం తప్పుడు సమాచారంతో అక్రమంగా ధ్రువపత్రాలు పొందడంతో బాలాపూర్ పోలీసులు వీరిపై కేసు నమోదుచేశారు. గురువారం మహ్మద్ యూనస్, సలీమా బేగం, మహ్మద్ నసీమ్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మహ్మద్ ఇస్మాయిల్, ఖతీజా, మహ్మద్ ఖాలిక్ గాలింపు చేపట్టారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications