అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్య: పోటీ పరీక్షల వాయిదానే కారణమంటూ అభ్యర్థుల భారీ ఆందోళన
హైదరాబాద్: నగరంలోని అశోక్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బృందావన్ హాస్టల్‌లో ఉంటున్న ప్రవల్లిక.. తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.
ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు హాస్టల్‌కు చేరుకున్నారు. అప్పటికే భారీగా చేరుకున్న పోటీ పరీక్షల అభ్యర్థులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు, అభ్యర్థులకు మధ్య కాస్త తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు, పోలీసులు చేరుకోవడంతో అశోక్ నగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లికి పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది. అయితే, తాజాగా, గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితులు అంటున్నారు. ప్రవల్లిక సూసైడ్ నోట్ బయటపెట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత
శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ వద్ద భారీ సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. విద్యార్థులు, అభ్యర్థులు భారీగా చేరుకోవడంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు.
విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ బీజేపీ లక్ష్మణ్
ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలసుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications