మంజా మెడకు చుట్టుకుని సైనికుడు మృతి: నలుగురి ప్రాణం తీసిన పతంగి
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా ఎగురవేసే పతంగుల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. మాంజా కారణంగా కొందరు చనిపోతే.. మరికొందరు పతంగులు ఎగురవేస్తూ భవనాలపైనుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. మంజా దారం మెడకు చుట్టుకుని సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో చోటు చేసుకుంది.
విశాఖపట్నంకు చెందిన కోటేశ్వర్ కొన్నాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద పతంగుల మాంజా దారం మెడకు చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డారు. స్తానికులు వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ కోటేశ్వర మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సైనికులకు అప్పగించారు. ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాదకరమైన చైనా మంజా వాడకూడదని హెచ్చరికలు జారీ చేసినా.. కొందరు నిబంధనలు ఉల్లంఘించి చైనా మంజా విక్రయిస్తున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ లు వినిపిస్తున్నాయి.
పతంగి ఎగురవేస్తూ యువకుడు మృతి
గాలిపటం ఎగురవేస్తూ ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడు. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవ శాత్తు భవనం పైనుంచి పడి మృతి చెందాడు యువకుడు.
సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆకాష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నాగోల్ లో విషాదం
గాలిపటం ఎగరవేస్తూ 4వ అంతస్తుల భవనంపై నుంచి పడి ఓ బాలిక మృతి చెందింది. ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి 8వ తరగతి విద్యార్థి శివ ప్రసన్న ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు, అత్తాపూర్‌లో ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications