నైటీలో వచ్చి మొబైల్ షోరూంలో భారీ దొంగతనం: ఆ ఒక్క పొరపాటుతో దొరికిపోయాడు
హైదరాబాద్: సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి దొంగబుద్ధి పుట్టింది. మొబైల్ షోరూంలో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి షోరూం తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అంతా ప్లాన్ ప్రకారమే చేసినా.. అతుడు చేసిన చిన్న పొరపాటుతో చివరకు పోలీసులకు చిక్కాడు. సికింద్రాబాద్ మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండిపల్లెకు చెందిన మంకాల యాకయ్య అలియాస్ వినయ్(28) తండ్రి చనిపోవడంతో ఉపాధి కోసం తల్లి, సోదరితో కలిసి ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. కంటోన్మెంట్ తాడ్‌బండ్, బాపూజీనగర్‌లో నివాసముంటూ సికింద్రాబాద్ ఎస్‌డీ రోడ్డులోని ఎమరాల్డ్ హౌస్‌లో నైట్ సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం సోదరి ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు.

కాగా, గతంలో యాకయ్య రియల్ మీ మొబైల్ షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎమరాల్డ్ హౌస్ మొదటి అంతస్తులో కూడా రియల్ మీ షోరూం ఉంది. అందులో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకుని..పక్కా ప్లాన్‌తో మే 28న రాత్రి 12.30 గంటలకు అతని సోదరి నైటీని ధరించి షోరూం వద్దకు వెళ్లాడు. షోరూంకి మరోవైపు మూసివేసి ఉన్న షెట్టర్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ట్యాబ్‌తో పాటు 27 మొబైల్ ఫోన్లను చోరీ చేసి సొంతూరుకు వెళ్లాడు.
అయితే, మే 29న ఉదయం మొబైల్ షోరూంలో చోరీ జరిగినట్లు స్టోర్ ఇంఛార్జీ మహ్మద్ యూసుఫ్ మహంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. దీంతో నైటీలో ఉన్న ఒక మహిళ వచ్చినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులను విచారించారు. ఇందులో భాగంగా యాకయ్యపై అనుమాని వచ్చి ఆ దిశగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితుడిని మడిపల్లెలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నేరం అంగీకరించాడు.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి రూ. 8.28 లక్షల విలువైన 37 రియల్ మీ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం రిమాండ్ కు తరలించారు. నిందితుడు పక్కా ప్లాన్‌తో దొంగతనం చేసినప్పటికీ.. సెలవు పెట్టి ఊరేళ్లడంతో అతనిపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో దర్యాప్తు జరపడంతో అతని వ్యవహారం బయటపడింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications