హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే రోజు ఏడు ప‌రిశ్ర‌మ‌ల ఆవిష్క‌ర‌ణ‌.. లైఫ్ సైన్సెస్ క్యాపిట‌ల్‌గా హైద‌రాబాద్ - మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

లైఫ్ సైన్సెస్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్ ఎదిగింద‌న్నారు తెలంగాణ రాష్ట్ర‌ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద మెడిక‌ల్ డివైజ్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్కును ఏర్పాటు చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు.. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదారాబాద్ త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో హ్యువెల్ లైఫ్ సైన్సెస్ సంస్థ తొలిసారి స్వ‌దేశీ టెస్టింగ్ కిట్‌ను తీసుకువ‌చ్చింద‌ని తెలిపారు.

ఒకే రోజు ఏడు ప‌రిశ్ర‌మ‌ల ఆవిష్క‌ర‌ణ‌

ఒకే రోజు ఏడు ప‌రిశ్ర‌మ‌ల ఆవిష్క‌ర‌ణ‌


సంగారెడ్డి ప‌రిధిలోని సుల్తాన్‌పూర్‌లో నెల‌కొల్పిన భార‌త‌దేశంలోనే అతి పెద్ద‌దైన మెడిక‌ల్ డివైజ్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌లో ఏడు కంపెనీల‌ను ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సుమారు 50 కంపెనీలు ఈ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌లో భూములు తీసుకుని ప‌నులు ప్రారంభించాయ‌ని పేర్కొన్నారు. వాటిల్లో ఏడు కంపెనీలు ఇప్ప‌టికే ప్రారంభ‌మైన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో మ‌రికొన్ని కంపెనీలు ప్రారంభంకానున్నాయ‌ని చెప్పారు. యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో లైఫ్ సైన్సెస్ రంగంలో హైద‌రాబాద్ మ‌రింత బ‌లోపేతం కానుంద‌ని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒకే రోజు ఏడు ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. హువెల్ లైఫ్ సైన్సెన్‌, ఎస్‌వీపీ టెక్నో ఇంజ‌నీర్స్‌, ప్రొమియా థెరాప్యూటిక్స్ , ఆకృతి ఒకులోప్లాస్టీ, ఎల్వికాన్ అండ్ డీస్‌మెలైఫ్, అర్కా ఇంజ‌నీర్స్‌ సంస్థ‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

 లైఫ్ సైన్సెస్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్

లైఫ్ సైన్సెస్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు మంత్రి కేటీఆర్. అన్నిరంగాల‌లో దూసుకెళ్తోంద‌ని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెన్స్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్ ఎదిగింద‌న్నారు. యువ పారిశ్రామిక వేత్త‌లు తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నార‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ముందుకు వ‌చ్చే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం రాయితీలు ఇస్తోంద‌ని చెప్పారు. భార‌త్ దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎద‌గాలంటే అంత ఈజీ కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌టి స‌వాళ్ల‌తో ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. నాలుగేళ్ల కింద‌ల తాను ప్రారంభించిన మెడిక‌ల్ డివైజ్ పార్క్ నేడు అద్బుతంగా రూపుదిద్దుకుంద‌ని పేర్కొన్నారు కేటీఆర్‌.

రోబోల సాయంలో శ‌స్త్ర‌చికిత్స‌..

రోబోల సాయంలో శ‌స్త్ర‌చికిత్స‌..

ఈ మెడిక‌ల్ డివైజ్ ఇండస్ట్రియ‌ల్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఏడు ప‌రిశ్ర‌మ‌ల నుంచి వైద్య రంగానికి సంబంధించిన అన‌లైజ‌ర్స్, విట్రో డ‌యాగ్నోస్టిక్ ప‌రిక‌రాలు, స‌ర్జిల‌క‌ల్, డెంట‌ల్ ఇంప్లాంట్స్‌, డ్రెసింగ్‌, కేర్ డివైజెస్‌ వంటి మెడిక‌ల్ ఉత్స‌త్తులు ఈ ప‌రిశ్ర‌మ‌ల నుంచి త‌యారు కానున్నాయి. ఇటీవ‌ల ప్రారంభించిన మెడ్‌ట్రానిక్ సంస్థ ఉత్ప‌త్తులు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈసంస్థ రోబోల సాయంలో శ‌స్త్ర‌చికిత్స‌లకు కృషి చేస్తోంద‌ని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు . అలాగే మై కేర్ లింక్‌ హాట్ యాప్‌ని కూడా అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా ఒకే సారి 40వేల మంది రోగుల‌ను ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చ‌ని తెలిపారు. మ‌రో వైపు ఈ రోజు ప్రారంభించిన కంపెనీల ద్వారా 1300 మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. వైద్య ప‌రిక‌రాల పార్కులో వివిధ కంపెనీలు ప్ర‌స్తుతం రూ. 265 కోట్ల‌కు పైగా పెట్ట‌బ‌డులు పెట్టిన‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు 2030 నాటికి హైద‌రాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇండ‌స్ట్రీస్ విలువ సుమారు 100 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని తెలంగాణ్ స‌ర్కార్‌ అంచ‌నా వేస్తోంది. .

English summary
Hyderabad as Life Sciences Capital says IT Minister KTR .. Seven Medical Companies Inauguration in One Day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X