అనుమానం: భార్యను చంపేసి, రైలుకిందపడి బ్యాంక్ అధికారి ఆత్మహత్య

హైదరాబాద్: బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 21 మాధవ్ ఆత్మహత్య చేసుకున్నాడు..

అతని భార్య కోసం చూడగా వారు ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు. దీంతో వారిని చంపేసి, ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాతనే భార్య హత్య ఉదంతం వెలుగు చూసింది.

 Hyderabad Bank official kills wife, commits suicide

మిర్యాలగూడకు చెందిన ముప్పయ్యేళ్ల మాధవ్‌కు కేతెపల్లికి చెందిన సుమలత(25)తో గత ఏడాది పెళ్లయింది. 2017 అక్టోబరు 10న వారి వివాహం జరిగంది. కొద్ది నెలలుగా మాధవ్‌ సిండికేట్‌ బ్యాంకు నల్లకుంట శాఖలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నాడు.

కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరుచూ గొడవ పడేవారు. దీనికి తోడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా, ఈ నెల 21న మధ్యాహ్నం మాధవ్‌.. విద్యానగర్‌, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి తర్వాత భార్య సుమలత కనిపించలేదు.

దీంతో ఆమె తల్లిదండ్రులు శనివారం రాత్రి నల్లకుంటలోని కూతురు ఇంటికి వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉంది. ఇంటి యజమాని సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉంది. చున్నీతో గొంతుకు ఉరివేసి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+