కాల్ గర్ల్‌తో వ్యాపారికి షాక్: అశ్లీలంగా ఫొటోలు తీసి, బ్లాక్ మెయిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓ ఫేస్‌బుక్ మిత్రుడి వలలో పడి హైదరాబాదుకు చెందిన ఓ వ్యాపారి తీవ్రంగా నష్టపోయాడు. అందమైన అమ్మాయి కోసం ఆశపడి జేబు గుల్ల చేసుకున్నాడు. కాల్‌గర్ల్స్‌ బ్లాక్‌మెయిల్‌కు భయపడి లక్షల రూపాయలు ఇచ్చుకున్నాడు. ఆ బాధను భరించలేక ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించాడు.

ముంబై కేంద్రంగా సాగుతున్న సెక్స్‌రాకెట్‌ గుట్టు బట్టబయలైన విషయం తెలిసిందే. హైదరాబాదులోని బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారికి ముంబైకి చెందిన దేవేందర్‌ శెట్టి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చాటింగ్‌ స్నేహం మొదలైంది. నిరుడు అక్టోబర్‌లో దేవేందర్‌శెట్టి ముంబై కాల్‌గర్ల్స్‌ గురించి చెప్పాడు.

Call girl

పదివేలు ఇస్తే అందమైన అమ్మాయిని పంపుతానని చెప్పాడు. ముగ్గురు యువతుల ఫొటోలు పంపాడు. వ్యాపారి ఇష్టపడిన ఫొటోలోని ఓ యువతి అక్టోబర్‌ 8న నగరానికి వచ్చింది. వ్యాపారితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తన సెల్‌ఫోన్‌లో బంధించింది. అతడు బాత్రూమ్‌లోకి వెళ్లగానే వ్యాపారి మొబైల్‌ ఫోన్‌ నుంచి అతడి కుటుంబ సభ్యుల ఫోన్‌నెంబర్లు, వ్యక్తిగత ఫొటోలు తీసుకుంది.

ముంబై వెళ్లిన తర్వాత కాల్‌గర్ల్స్‌తో ఉన్నట్టు ఫొటోలు రూపొందించారు. వారం రోజుల తరువాత వ్యాపారికి ఫేస్‌బుక్‌ స్నేహితుడి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాల్‌గర్ల్స్‌తో ఉన్న ఫొటోలను యూట్యూబ్‌లో పెడతానని, కుటుంబ సభ్యులకు పంపుతానంటూ బెదిరించాడు. కొన్ని ఫొటోలను వ్యాపారికి వాట్సప్‌ ద్వారా పంపాడు. వాటిని చూసిన అతడు షాక్ తిన్నాడు

ఆ ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపితే పరువుపోతుందని భయపడ్డాడు. దేవర్‌శెట్టి డిమాండ్‌కు తలొగ్గి అడిగిన ప్రతిసారీ డబ్బు పంపుతూ వచ్చాడు. ఆరు నెలల వ్యవధిలో రూ.30లక్షల వరకూ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా భారీ మొత్తం కావాలని దేవేందర్‌శెట్టి ఒత్తిడి చేశాడు. దాంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిసహా మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Mumbai Facebook friend blackmailed a Hyderabad businessman with call girls photos.
Please Wait while comments are loading...