హైదరాబాద్- చెన్నై బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్.. ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు శుభవార్త!
భారతీయ రైల్వే జెట్ వేగంలో దూసుకుపోతోంది. భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల విస్తరణకు రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ మార్గంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి 2030 నాటికి ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇదే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా హై స్పీడ్ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఆలోచన చేస్తుంది భారతీయ రైల్వే.
దక్షిణాది రాష్ట్రాలలో బుల్లెట్ రైల్ కారిడార్ ఏర్పాటుపై అధ్యయనం
బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేస్తోంది. హైదరాబాద్ చెన్నై మధ్య దక్షిణాది రాష్ట్రాలలో హైస్పీడ్ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం మొదలుపెట్టింది. ఒకవేళ ఇదే కనుక సాధ్యమైతే దక్షిణాదిలో ఇది మొదటి బుల్లెట్ రైలు మార్గం కాబోతుంది. నవరత్న పిఎస్యు అయిన రైట్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుంది.

హైదరాబాద్ నుండి చెన్నై కి హైస్పీడ్ కారిడార్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్
ఇక్కడి ట్రాఫిక్ విశ్లేషణ, డిమాండ్ అంచనాలను, అలైన్మెంట్ సర్వేలను చేస్తూ పలు కీలక అంశాలను పరిశీలిస్తుంది. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ కు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను సిద్ధం చేసి రంగంలోకి దిగనున్నారు. ఈ బుల్లెట్ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మేలు జరుగుతుంది.
హైదరాబాద్ చెన్నై మధ్య రెండున్నర గంటల లోపే ప్రయాణం
దీంతో హైదరాబాద్ చెన్నై మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణం చేయాలంటే 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ బుల్లెట్ రైలు వస్తే కేవలం రెండు గంటల 20 నిమిషాల లోని చెన్నైకు చేరుకోవచ్చు. ఇక రైల్వే శాఖ దక్షిణాదిలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశించినట్టు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ రైల్వే కారిడార్ తో లబ్ది పొందే నగరాలివే
ఈ రైల్వే కారిడార్ హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు 4 నగరాలను కలుపుతుందని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇది ఈ నాలుగు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించి. ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు విశాఖ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్ చెన్నై మార్గంతో దక్షిణాది రాష్ట్రాలకు శుభవార్త
భారతదేశంలో హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ను అభివృద్ధి చేయడానికి రైల్వే శాఖ గతంలో కొన్ని మార్గాలను గుర్తించింది. ఈ మార్గాలలో బుల్లెట్ రైళ్ళు నడవ నున్నాయి. ఢిల్లీ వారణాసి, ఢిల్లీ అహ్మదాబాద్, చెన్నై మైసూర్, ఢిల్లీ అమృత్సర్, వారణాసి హౌరా, ముంబై నాగపూర్, ముంబై హైదరాబాద్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ జాబితాలో హైదరాబాద్ చెన్నై మార్గం కూడా చేరడం దక్షిణాది రాష్ట్రాలకు శుభవార్త.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications