హైదరాబాద్ - చెన్నై వయా తిరుపతి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో కీలక అడుగు!
హైదరాబాద్ - చెన్నై నగరాల మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైస్పీడ్ రైలు కారిడార్ కీలక దశలోకి అడుగు పెట్టింది. 778 కిలోమీటర్ల హై స్పీడ్ రైలు కారిడార్ యొక్క తుది అలైన్మెంట్ ను దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ఈ సమర్పణ హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేయడం కోసం కీలకమైన ముందడుగుగా చెబుతున్నారు.
లేటెస్ట్ అలైన్మెంట్ లో తిరుపతి స్టేషన్
హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ మొదట గుడివాడ మీదుగా ప్రణాళిక చేయబడింది. అయితే తాజా అలైన్మెంట్ లో తిరుపతిని చేర్చడం వల్ల ఈ రైలు కారిడార్ ప్రయాణికులకు విస్తృతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది హైదరాబాద్- చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుంది . ప్రస్తుతం హైదరాబాద్ చెన్నై మధ్య రైలు ప్రయాణం 12 గంటల సమయం పడుతుంది.

చెన్నై హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం ఆదా
ఈ కొత్త హై స్పీడ్ రైలుతో రెండు గంటల 20 నిమిషాల సమయంలో చెన్నై చేరుకోవచ్చు. ఇది రెండు నగరాల మధ్య వేగవంతమైన సమర్థవంతమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ ప్రాజెక్టు రెండు నగరాల మధ్య ఆర్థిక సంబంధాలను, వ్యాపార అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా మెరుగైన అవకాశాలను ఇస్తుంది.
హైదరాబాద్, చెన్నై రెండు నగరాలు ఆర్థికంగా అభివృద్ధి
దక్షిణ భారతదేశంలో రైల్వేకు సంబంధించి ఈ ప్రాజెక్టు ఒక కీలకమైన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు కారణంగా అటు హైదరాబాద్, ఇటు చెన్నై రెండు నగరాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తమిళనాడులో చెన్నై సెంట్రల్, మరొకటి చెన్నై రింగ్ రోడ్డు వెంబడి మింజూర్ స్టేషన్లను కూడా కలుపుతుంది. ఈ స్టేషన్ లు హైస్పీడ్ రైలు నెట్వర్క్ లో కీలకమైన నోడ్ లుగా పనిచేస్తాయి.
తమిళనాడు రవాణా శాఖ అనుమతి కోరిన సౌత్ సెంట్రల్ రైల్వే
ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతి స్టేషన్ సైట్లో సుమారు 50ఎకరాల భూమిని రవాణా ఆధారిత హబ్ ల అభివృద్ధి కోసం అడుగుతుంది .బుల్లెట్ రైళ్లు ఆగే స్టేషన్లచుట్టూ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇదిలాఉంటే బుల్లెట్ రైలు ఆగే స్టేషన్ల స్థానాలను ఖరారు చేయడంతో పాటు, సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదిత అలైన్మెంట్, భూసేకరణకు అంగీకారం కోసం తమిళనాడు రవాణాశాఖ నుంచి కూడా అనుమతి కోరింది.
స్పీడ్ పెంచిన దక్షిణ మధ్య రైల్వే.. వేగంగా అడుగులు
రాష్ట్ర దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రణాళికలను ప్రాజెక్టులో చేర్చడం కోసం ఈ చర్యలు ఎంతో అవసరమని అభిప్రాయపడింది. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం స్పీడ్ పెంచిన సౌత్ సెంట్రల్ రైల్వే అవసరమైన అన్ని అనుమతులను పొందడం, భూసేకరణ ఖరారు చేయడం, ఇంజనీరింగ్ పనులను పూర్తి చేయడంపైన దృష్టి సారిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు కేవలం హైస్పీడ్ రైలు చొరవ మాత్రమే కాదని, ఆర్థిక వృద్ధికి ఉద్యోగాల కల్పనకు, ప్రాంతీయ ఏకీకరణకు కూడా దోహదం చేస్తుందని రైల్వే భావిస్తుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications