పెద్దలు కుదిర్చినా సరే... పెళ్లి ముసుగులో పొంచిఉన్న ప్రమాదం.. సజ్జనార్ హెచ్చరిక
పెళ్లి ముసుగులో ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాదులో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఇలా
ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ కి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు. మోసం జరుగుతున్న తీరును వివరించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ముందుగా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చూపులు చూస్తారని, ఆపై ఎంగేజ్మెంట్ జరిపించుకుని పెళ్లి ఖాయమైంది కదా అనే చదువుతో యువతులకు దగ్గర అవుతున్నారని పేర్కొన్నారు.

పెళ్లి పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్
యువతులకు మాయమాటలు చెప్పి, త్వరలోనే పెళ్లి చేసుకుంటాం కదా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా లోబరుచుకుంటున్నారని, తీరా తమ కోరిక తీరిన తర్వాత అసలు రంగు బయట పెడుతున్నారని ఆయన అన్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆమ్మాయిలకు, తల్లిదండ్రులకు సీపీ హెచ్చరిక
నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడం, తీరా పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కేటుగాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని పరువు పోతుందని భావించి భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని సీపీ హెచ్చరిస్తున్నారు.
పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే
నిశ్చితార్థం అయినా సరే పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని cp సూచిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం కదా అని గుడ్డిగా నమ్మొద్దని, అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్ల పైన ఆరా తీసి పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని పేర్కొన్నారు. శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ధైర్యంగా తిరస్కరించాలని చెప్పారు.
వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్న సీపీ
భయపడకుండా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎటువంటి భయం లేకుండా ముందుకు రావాలని ఆయన వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. ఇక అమ్మాయిలకు ఇటువంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9 4 9 0 6 1 6 555 కు గాని, డయల్ 100 కి కానీ కాల్ చేయాలని సూచించారు.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications