హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిలియన్ డాలర్ స్మైల్: ‘బాలుడు-ఇన్‌స్పెక్టర్’ ఫొటో వైరల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

TS

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చిన క్షణాల్లో స్పందిస్తూ పరిష్కారం చూపిస్తున్నారు. నేరాలను తగ్గించడంలో మెరుగైన పాత్రను పోషిస్తున్నారు. అంతేగాక, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. కాగా, తాజాగా, ఇందుకు ఉదాహరణగా తెలుగు రాష్ట్రాల్లో రెండు ఘటనలో చోటు చేసుకున్నాయి. అవి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఫైజాన్ ఖాన్ అనే నాలుగు నెలల బాలుడి కిడ్నాప్ జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. విస్తృతంగా గాలింపు చేసి బాలుడి ఆచూకీని కనుగొన్నారు. అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా తనను ఎత్తుకున్న ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్ ను చూసి ఆ బాలుడు చిరునవ్వులు చిందించాడు. దీంతో అక్కడున్న వారిలో కూడా నవ్వులు పూశాయి. కాగా, ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

కిడ్నాప్ వివరాల్లోకి వెళితే.. చిన్నారి ఫైజాన్ ఖాన్ తల్లి హుమీరా బేగం.. పగలంతా పని చేసి.. రాత్రి నాంపల్లిలోని ఓ నగల దుకాణం పక్కన పడుకునేది. గత బుధవారం రాత్రి అలాగే నిద్రలో ఉండగా... తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫైజాన్ ఖాన్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఆమెకు మెలకువ వచ్చేసరికి బాబు కనిపించలేదు. దీంతో బంధువులతో కలిసి నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది.

సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బాబును కిడ్నాప్ చేసిన వారిని గుర్తించారు. తామే చిన్నారిని కిడ్నాప్ చేశామని న్యూ అగాపురా ప్రాంతానికి చెందిన మహ్మద్ ముస్తాఖ్, హబీబ్ నగర్‌కు చెందిన మహ్మద్ యూసఫ్ పోలీసుల విచారణలో అంగీకరించారు.

వీళ్లు కిడ్నాప్ చేసింది.. రహ్మత్ నగర్ కు చెందిన తమ స్నేహితు మహమ్మద్ గౌస్ కు ఇవ్వడానికి. కానీ గౌస్ ఈ వ్యవహారంలో ఓ తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. వద్దని చెప్పడంతో తిరిగి ఇవ్వడానికి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేసి.. తల్లి వద్దకు చేర్పించారు. దీంతో ఫైజాన్ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కుమారుడి కిడ్నాప్ కేసులో వెంటనే స్పందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

English summary
A picture of a Hyderabad police officer smiling down at the 4-month-old baby boy he rescued from a kidnapping is currently going viral on social media. The heartwarming pic shows Inspector R Sanjay Kumar of Nampally Police Station with Faizan Khan, a 4-month-old boy who's grinning ear to ear looking up at him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X