Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'లక్కీడ్రా' పేరుతో మోసాలకు పాల్పడితే.. వారికి సజ్జనార్‌ వార్నింగ్‌

చాలామంది లక్కీ డ్రా పేరుతో అనేక మోసాలకు పాల్పడుతుంటారు. ఇది కొంటే అది ఉచితం.. అది కొంటే ఇది ఉచితం అంటూ ప్రజల్ని బురిడీ కొట్టిస్తుంటారు. అయితే ఇదే విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్కీ డ్రాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్‌ ఫ్లూయెన్సర్లను హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌ లో పోస్టు చేశారు.

బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైమ్ లపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ తాజాగా బెట్టింగ్ యాప్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్కీ డ్రా పేరుతో ప్రజల్ని మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్లు, బైకులు ఇస్తామంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే లేదా ప్రోత్సహించే సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లను సైతం ఉపేక్షించేది లేదని సజ్జనార్ స్పష్టం చేశారు.

"రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో ఫ్రాడ్! లక్కీ డ్రా ఇన్‌ ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త!.. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. The Prize Chits and Money Circulation Schemes (Banning) Act-1978 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్‌ లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవు" అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

Hyderabad CP Sajjanar Warns Influencers Strict Legal Action Over Fake Lucky Draw Scams

ఇటీవల లక్కీ డ్రాల పేరుతో పలువురు ఇన్ ఫ్లూయెన్సర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ ఫ్లూయెన్సర్ల చేతిలో అనేకమంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. ఈ క్రమంలోనే వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+