ఉదయ్‌పై కాల్పులు, శశికుమార్ సూసైడ్‌లో కొత్త కోణాలు: అందుకే ఆత్మహత్యనా? భార్యకు 'సారీ'
హైదరాబాద్: భాగ్యనగరంలోని హిమయత్ నగర్‌లో ఉదయ్ అనే డాక్టర్ పైన మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపిన ఘటనలో కొత్త ట్విస్ట్. ఉదయ్, సాయి, శశికుమార్ అనే ముగ్గురు వైద్యులు మాదాపూర్‌లో స్థాపించిన లారల్ ఆసుపత్రి విషయంలో వివాదం వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉదయ్ పైన సోమవారం సాయంత్రం శశికుమార్ కాల్పులు జరిపాడని వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం ఉదయం నాటికి శశికుమార్ మొయినాబాద్ నక్కలగుడ్డలో ఉన్న తన ఫాం హౌస్‌లో గన్‌తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... ఉదయ్ చనిపోయాడని భావించి శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నట్లు చెప్పారు. మొత్తం విషయాలు విచారణలో తేలుతాయన్నారు. కాగా, భార్య ఫోన్ చేసినప్పటికీ శశికుమార్ 'సారీ' అని చెప్పి ఫోన్ పెట్టేసినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఉదయ్ పైన తాను కాల్పులు జరపలేదని, మరో డాక్టర్ సాయి కాల్పులు జరిపాడని, నేను భయపడి పారిపోయానని శశికుమార్ సూసైడ్ నోట్ రాసిన విషయం తెలిసిందే. తన చావుకు సాయి కుమార్, ఉదయ్ కారణమని శశికుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు.
తన వద్ద పని చేసిన వారే తనను మోసం చేశారని పేర్కొన్నారు. మరోవైపు, శశికుమార్ స్నేహితుడి భార్య చంద్రకళ అతనిని మొయినాబాద్ ఫాంహౌస్‌లో వదిలేసి వెళ్లిపోయింది. ఆమె మంగళవారం ఉదయం వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనిని ఫాంహౌస్‌లో తానే విడిచిపెట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications