ఆ కల్చర్ మీరే తెచ్చారట.. పొరపాటున తీసుకున్నానేమో: 13 గం. విచారణ, తరుణ్ తడబాటు

డ్రగ్స్ వ్యవహారంలో నటుడు తరుణ్‌ విచారణ పదమూడు గంటల అనంతరం ముగిసింది. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు విచారించారు.

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో నటుడు తరుణ్‌ విచారణ పదమూడు గంటల అనంతరం ముగిసింది. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు విచారించారు.

నటనకు దూరంగా ఉన్నా.. తరిచితరిచి

నటనకు దూరంగా ఉన్నా.. తరిచితరిచి

కెల్విన్‌ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని సమాచారం ఆధారంగానే తరుణ్‌ను సిట్ అధికారులు తరిచితరిచి ప్రశ్నించారు. ముఖ్యంగా యువ నటులతో సన్నిహితంగా ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో ప్రశ్నించారు. చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్నప్పటికీ కెల్విన్‌ ముఠాతో ఎలా సంబంధాలు నెలకొన్నాయన్న దానిపై అధికారులు ఎక్కువగా దృష్టి సాధించారని తెలుస్తోంది.

Recommended Video

    Subba Raju Reveals Star Family's Name In SIT Investigation
    డ్రగ్స్ వాడనని కానీ, ఆర్థికంగా బలహీనంగా: తరుణ్

    డ్రగ్స్ వాడనని కానీ, ఆర్థికంగా బలహీనంగా: తరుణ్

    తాను డ్రగ్స్ వాడనని, తనకు ఇందులో ఏమాత్రం ప్రమేయం లేదని, చాలాకాలంగా తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నానని తరుణ్‌ చెప్పారని తెలుస్తోంది. అయితే, తమ వద్ద తరుణ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ వివరాలు ఆధారంగా చూపించారని తెలుస్తోంది. వాటి ఆధారంగా విచారణ చేశారని సమాచారం. మరో సమయంలో పొరపాటున ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నానేమో కానీ, ఇప్పుడయితే అలవాటు లేదని చెప్పాడని కూడా తెలుస్తోంది. తాను డ్రగ్స్ బానిసను కాదని చెప్పాడని సమాచారం. ఆర్థికంగా బలహీనంగా ఉన్నానని, మనసు మనసులో లేదని చెప్పాడని తెలుస్తోంది.

    కెల్విన్ వద్ద నీ నెంబర్ ఎలా, పబ్బు ఎందుకు మూసేశావు?

    కెల్విన్ వద్ద నీ నెంబర్ ఎలా, పబ్బు ఎందుకు మూసేశావు?

    కెల్విన్‌‌తో సంబంధం లేనప్పుడు వారి వద్ద నీ ఫోన్‌ నెంబర్లు ఎలా ఉన్నాయని అధికారులు తరుణ్‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. మిగతా నటులు, పబ్బులలో జరిగే వ్యవహారాలు, గతంలో పబ్బు మూసివేయడానికి గల కారణాలు వంటి అంశాల గురించి కూడా అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.

    తరుణ్ తడబాటు

    తరుణ్ తడబాటు

    కెల్విన్‌‌తో సంబంధాలపై ఆధారాలతో సహా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేందుకు తరుణ్ తడబడినట్లుగా తెలుస్తోంది. చాలా వాటికి సమాధానం చెప్పినప్పటికీ.. కొన్ని చిక్కు ప్రశ్నలకు పొడి పొడి సమాధానాలు చెప్పారని తెలుస్తోంది.

    గోవా వెళ్లడంపై..

    గోవా వెళ్లడంపై..

    గోవా ఎందుకు వెళ్లేవాడివని, అక్కడ రోజుల కొద్ది ఎందుకు ఉండేవాడివని అడిగితే.. తాను డ్రగ్ వ్యవహారంపై గోవా వెళ్లలేదని, డ్రగ్ డీల్స్ తెలియవని చెప్పాడని తెలుస్తోంది. వెళ్లినా హోటళ్లు, రెస్టారెంటు వ్యాపారాల్లో భాగంగా మాత్రమే వెళ్లేవాడినని చెప్పాడని సమాచారం. అదే సమయంలో డ్రగ్ తన పబ్బులోనే కాదని, చాలా పబ్బుల్లో కనిపిస్తుందని చెబుతూ.. కొన్ని పబ్బుల గురించి తరుణ్ చెప్పాడని అంటున్నారు. చెడ్డపేరు వస్తుందనే తన పబ్బు మూసివేసినట్లుగా చెప్పాడని సమాచారం.

    సంప్రదాయ కుటుంబం: తరుణ్, డ్రగ్ కల్చర్ మీదేనని

    సంప్రదాయ కుటుంబం: తరుణ్, డ్రగ్ కల్చర్ మీదేనని

    తమది సంప్రదాయ కుటుంబమని, డీసెంట్ ఫ్యామిలీ అని, ఎలాంటి చెడు అలవాట్లు కూడా తనకు లేవని సమాధానం చెప్పాడని తెలుస్తోంది. మూడు పబ్బుల్లో భాగస్వామ్యం ఉందని, అసలు పబ్‌లలో డ్రగ్ కల్చర్ తీసుకు వచ్చిందే మీరు అని చాలామంది చెబుతున్నారని సిట్ అధికారులు అడగ్గా.. తనకు అలాంటి అలవాటు లేదని, పబ్‌ల వ్యాపారం కూడా ఇప్పుడు లేదని చెప్పాడని తెలుస్తోంది.

    కెల్విన్, జీశాన్‌తో డ్యాన్సులు

    కెల్విన్, జీశాన్‌తో డ్యాన్సులు

    కెల్విన్, జీశాన్‌లతో పబ్బుల్లో తరుణ్ డ్యాన్స్ చేస్తున్న, మద్యం తాగుతున్న వీడియోలను అధికారులు గుర్తించారని, వీటిని ఆయనకు విచారణ సందర్భంగా చూపించారని తెలుస్తోంది. ఈవెంట్ మేనేజర్లుగా మాత్రమే తెలుసునని చెప్పాడని, తరుచూ పార్టీలో కలవడం వల్ల వీడియోలో ఉండవచ్చునని తరుణ్ సమాధానం చెప్పాడని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+