GHMC Elections 2020 Results: ఇది ట్రైలర్ మాత్రమే, బాహుబలి కంటే పెద్ద సినిమా ఉంటుంది, కుష్బు !
హైదరాబాద్/ చెన్నై/ బెంగళూరు: దేశవ్యాప్తంగా జీహెచ్ఎంసీ (GHMC Election Results 2020) ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో ఊహించని విధంగా బీజేపీ ఢీకొనడంతో అందరూ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో బీజేపీ తన సత్తాచాటుకుంటుందని, దక్షిణ భారతదేశంలో మరో ముందడుగు పడుతోందని బహుబాష నటి, బీజేపీ నేత కుష్బు అన్నారు. మీరే చూడండి. హైదరాబాద్ లో మా సత్తా చాటుతాం, ఇది పునాది మాత్రమే, ముందుముందు చాలా ఉంది అంటూ నటి కుష్బు ఆసక్తికరంగా వరస ట్విట్ లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ట్రైలర్ మాత్రమే, బాహుబలి కంటే పెద్ద సినిమా కచ్చితంగా ఉంటుంది అని కుష్బు అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పి నటి కుష్బు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బీపీ పెంచుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు
GHMC ఎన్నికల ఫలితాల విషయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చాలా మందికి గంటగంటకు బీపీ పెరిగిపోతుంది. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ మెజారీ ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోవడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు కంగుతిన్నారు. మెజార్టీ డివిజన్లలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది.
బీజేపీకి ఇంత శాతం ఓట్లు వచ్చాయా ?
జీహెచ్ఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లో మొదటి స్థానంలో బీజేపీ ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించగానే టీఆర్ఎస్ నాయకులు కంగుతిన్నారు. ఓరి దేవుడో, ఏదో కొంప మునిగేటట్లు ఉందిరా నాయనా అంటూ టీఆర్ఎస్ నాయకులు టెన్షన్ కు గురైనారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ అధిక శాతం ఓట్లు కైవసం చేసుకుంది.

ఇది ట్రైలర్ మాత్రమే... సినిమా చూస్తే అంతే కథ !
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్బంగా బహుబాష నటి, బీజేపీ మహిళా నేత కుష్బు స్పంధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుకుంటుందని, అధికార పార్టీకి చుక్కలు చూపిస్తామని నటి కుష్బు అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుముందు బాహుబలి కంటే పెద్ద సినిమా ఉంటుంది, కథ ఇంకా రసవత్తరంగా ఉంటుంది, మీరే చూస్తారు కదా అంటూ నటి కుష్బు ట్విట్ చేశారు.
దక్షిణ భారతదేశంలో పాతుకుపోతాం
దక్షిణ భారతదేశంలో బీజేపీ తన సత్తా చాటుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు చక్కటి అవకాశంగా వచ్చిందని నటి కుష్బు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది, దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకుంటుంది, ఇక్కడ మేము అధికారంలోకి వస్తామని నటి కుష్బు ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలో వస్తుందని నటి కుస్బుతో పాటు అనేక మంది బీజేపీ జాతీయ నాయకులు ట్విట్ లు చెయ్యడంతో బీజేపీ కార్యకర్తలు మంచిజోరు మీద ఉన్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications