అక్కడ ఉండలేక వచ్చింది: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
తమ వివాహేతర సంబంధానికి అఢ్డు వస్తున్నాడన్న ఆక్రోషంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: తమ వివాహేతర సంబంధానికి అఢ్డు వస్తున్నాడన్న ఆక్రోషంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆ భర్త తన తండ్రి చనిపోవడంతో సౌదీ అరేబీయా నుంచి వచ్చాడు. కానీ భార్య చేతుల్లో హతమయ్యాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడితో కలిసి ఆమె చంపేసి ఉంటుందని భావిస్తున్నారు.
సనత్ నగర్‌లోని కైలాష్‌నగర్‌లో నివసిస్తున్న రఫీక్ (38)కు షబ్నూర్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. సౌదీ అరేబియాలో సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం రావడంతో రఫీక్ భార్యతో కలిసి వెళ్లాడు. కానీ తాను సౌదీలో ఉండలేనని భార్య షబ్నూర్ తిరిగి వచ్చింది. కైలాష్‌నగర్‌లోని అత్తగారింట్లో ఉంటోంది.

ఇటీవల రఫీక్ తండ్రి అబ్దుల్లా చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న రఫీక్ నగరానికి వచ్చాడు. శనివారం అర్ధరాత్రి 12.15 ప్రాంతంలో భార్యాభర్తలు ఒకే గదిలో ఉన్నారు. కానీ ఆదివారం ఉదయం గదిలో నుంచి భార్యాభర్తల్లో ఒక్కరు కూడా బయటకు రాలేదు.
దీంతో దగ్గరి బంధువులు లోనికి వెళ్లి చూశారు. రఫీక్ తలపై తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన భార్య షబ్నూర్ మాత్రం కనిపించలేదు. అతడిని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ మేరకు బంధువులు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షబ్నూరే అతన్ని హత్య చేసి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న షబ్నూర్ కోసం గాలిస్తున్నారు.
కాగా, షబ్నూర్ వివాహానికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు. తల్లిదండ్రులు బలవంతం చేయడంతో రఫీక్‌తో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని అంటున్నారు. ఇప్పుడు భర్త సౌదీ నుంచి ఇక్కడకు రావడంతో ప్రియుడితో కలిసి హత్య చేసి ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications