హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

26 నుంచి హైదరాబాద్‌ను వణికించనున్న చలి: తెలంగాణ జిల్లాల్లో కూడా, ఎల్లో అలర్ట్

జనవరి 26 నుంచి మళ్లీ శీతాకాలపు చలి తిరిగి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుందని పేర్కొంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత వారం పది రోజులుగా చలి తీవ్రత తక్కువగానే ఉంది. అయితే, గత ఒకటి రెండు రోజులుగా హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత కాస్త పెరిగింది. తాజాగా, భారత వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచనలు చేసింది.

26 నుంచి మళ్లీ వణికించనున్న చలి

26 నుంచి మళ్లీ వణికించనున్న చలి

జనవరి 26 నుంచి మళ్లీ శీతాకాలపు చలి తిరిగి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

హైదరాబాద్‌ నగరంలో పొగమంచు కురిసే అవకాశం

హైదరాబాద్‌ నగరంలో పొగమంచు కురిసే అవకాశం


తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం.. జనవరి 26న కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని, అయితే, నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండే అవకాశం ఉంది. జనవరి 27 వరకు హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ఏడు జోన్‌లలో ఉదయం వేళల్లో పొగమంచు లేదా పొగమంచు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువే

హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువే

ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాలు, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం చలిగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తోపాటు కొన్ని జిల్లాలకు, జనవరి 25 నుంచి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

గత రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని పొరుగు జిల్లా రంగారెడ్డిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

జనవరి 9న హైదరాబాద్‌లో ఈ శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అదే రోజు సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి, కుమురం భీమ్, వికారాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆరు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

English summary
Hyderabad is likely to see dip in temperature from January 26th: IMD issues yellow alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X