హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ పేలుళ్ల కోసం హైదరాబాద్ ఐఎస్ఐఎస్ యత్నం: ఎన్ఐఏ

హైదరాబాద్ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జీ షీటు దాఖలు చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జీ షీటు దాఖలు చేసింది. ఐఎస్.. దేశంలో పలు చోట్ల బాంబులు పేల్చేందుకు యువతను నియమించుకుంటోందని, వారికి శిక్షణ కూడా ఇస్తోందని ఎన్ఐఏ పేర్కొంది.

ఇండియన్ పీనల్ కోడ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేరం కింద మొహమ్మద్ ఇర్ఫాన్‌ను ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ తన ఛార్జీషీటులో పేర్కొంది.
మొహమ్మద్ ఇర్ఫాన్ హైదరాబాద్‌ జహీరానగర్‌ మీర్ అలా మండిలో నివాసం(ఇంటి నెం. 22-3-620) ఉంటున్నాడని తెలిపింది.

Hyderabad ISIS recruits scouted for hideouts to carry major terror strikes: NIA

ఇర్ఫాన్ తోపాటు మరో 8మందిపై ఎన్ఐఏ అభియోగాలను నమోదు చేసింది. ఇర్ఫాన్‌ జనవరి 17, 2017న అరెస్టయ్యాడు. మరో నిందితుడు ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్‌తో కలిసి ఉగ్ర దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన వారి కోసం హైదరాబాద్ నగర శివారులో వసతిని ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. అంతేగాక, వీరు ఉగ్ర దాడులకు ఏలా పాల్పడేదానిపై కూడా వారికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది.

మొహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు మొహమ్మద్ ఇర్ఫాన్‌ పేలుడు పదార్థాలను సేకరించి, పంపిణీ చేశాడు. మొహమ్మద్ ఇలియాస్ యజ్దానీతో కలిసి నల్గొండ జిల్లా శివారు ప్రాంతమైన పోచంపల్లిలో ఈ వ్యవహారం నడిపారు. విదేశీయుడు ఇందులో పాల్పంచుకున్నట్లు తెలిపారు. అతడే లొకేషన్ నిర్ణయించాడు. కాగా, ఇర్ఫాన్ అనంతపురంకు కూడా వెళ్లాడు. మొహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ ద్వారా కో-ఆర్డినేట్స్‌‌ను పంపి పేలుడు పదార్థాలను సేకరించాడు.

English summary
The National Investigation Agency has filed a chargesheet in the Hyderabad Islamic State case. The NIA has detailed how the module had tried to set up training grounds and a safe house from where attacks were to be launched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X