ఇవాంకా ట్రంప్, మోడీ పర్యటన: ఉద్యోగులకు ఐటీ కంపెనీల సూచనలు
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో హైదరాబాదులోని కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించాయి.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో హైదరాబాదులోని కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించాయి.
Recommended Video

Ivanka Trump in Hyderabad : Security beefed up in Hyderabad
ఈ సదస్సుకు ఎక్కువగా వీవీఐపీలు వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి ఇళ్ల నుంచి పని చేయాలని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు చెప్పాయి.హైటెక్ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు పలు మళ్లింపులు, క్రమబద్దీకరణ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్ల నుంచే పని చేయనున్నారు.

తాము పని చేసే కంపెనీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారని, కాబట్టి తమ కంపెనీలు ఇంటి నుంచి పని చేయమని చెప్పాయని సాఫ్టువేర్ ఉద్యోగులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications