ఇక ముస్లింలకు రొయ్యలు నిషేధిత ఆహారం: జామియా నిజామియా ఫత్వా

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఇకపై ముస్లింలెవరూ రొయ్యలను తినకూడదంటూ ప్రఖ్యాత ఇస్లామిక్‌ విద్యాసంస్థ జామియా నిజామియా ఫత్వా జారీచేసింది. ఆర్థ్రోపోడా(కీటకాల) వర్గానికి చెందిన రొయ్యలు.. చేపజాతికి చెందినవి కావని, తేళ్లు, సాలెపురుగుల వంటి కీటకాలని ఫత్వాలో పేర్కొన్నారు.

అవి అతిదుష్టమైనవి కాబట్టే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోరాదని ఆదేశించారు. జామియా నిజామియా ప్రధాన గురువు ముఫ్తీ మహమ్మద్‌ అజీముద్దీన్‌ ఈ మేరకు జనవరి 1న జారీచేసిన ఫత్వా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Hyderabad: Jamia Nizamia issues fatwa against eating prawns

142 ఏళ్లుగా హైదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతోన్న జామియా నిజామియా.. దేశంలో సుదీర్ఘకాలంగా నడుస్తోన్న ఇస్లామిక్‌ డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఒకటగా ఉంది. కాగా కొందరు ముస్లిమ్ పండితులు జామియా విధించిన ఫత్వాతో విభేదిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad-based Jamia Nizamia has triggered controversy after reportedly issuing a ‘fatwa’ or decree that consuming prawn was not allowed in Islam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి