అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు, వెళ్లిన కొద్ది రోజుల్లోనే
హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో నివసిస్తున్న హైదరాబాద్ యువకుడు మహ్మద్ అక్బర్ పైన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలను ఘటనలో గాయపడ్డ అక్బర్ తండ్రి యూసుఫ్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఉంటున్న అక్బర్ సోదరుడు మహ్మద్ షపీకి వివరించారు.

కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సు చేసిన మహ్మద్ అక్బర్ తదుపరి చదువుల కోసం నెల రోజుల క్రితం చికాగోకు వెళ్లారు. బుధవారం రాత్రి ఆయన చికాగోలోని అల్‌బిర్ని పార్కుకు వెళ్లారు. కారు పార్కింగ్ వద్ద నిలుచోగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో గడ్డం కింద, మరోచోట గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications