Weather Report: ఆ జిల్లాల్లో వడగళ్ల వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. సిద్దిపేట జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ద్రోణి కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. వడగండ్ల వానకు సైతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 34 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండదని సూచించింది.

yellow alert

శుక్రవారం సాయంత్రం, రాత్రి తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోన పలు గ్రామాల్లో వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+