హైదరాబాద్ మెట్రో మొదటిదశ టేకోవర్ - రెండోదశ భవిష్యత్తుపై తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్తుపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెట్రో మొదటి దశ టేకోవర్, రెండో దశ విస్తరణ విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారు. కేంద్రం చెప్పిన ప్రకారమే ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టును టేకోవర్ చేశామని, ఇప్పుడు దాని భవిష్యత్తు కేంద్రం చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం నగరంలో 70 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ ఉంది. ఒక కిలోమీటర్ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు అవుతుందని, భూసేకరణ ఖర్చు అదనమని చెప్పారు. దీని ప్రకారం ప్రస్తుత ప్రాజెక్టు విలువ రూ.21 వేల కోట్లు ఉంటుంది. అయితే మెట్రో ప్రస్తుతం ఏటా రూ.600 కోట్ల నష్టంలో నడుస్తోంది. ఈ నష్టం మరో 20 ఏళ్లు కొనసాగితే రూ.12 వేల కోట్లకు చేరుతుంది.

Hyderabad Metro Phase-1 Takeover Complete - Phase-2 Future in Centre s Hands CM Revanth Reddy

అందుకే యథాతథంగా ఇచ్చేస్తే వారి బ్యాంకు లోన్లను మేమే చెల్లిస్తామని నచ్చజెప్పి ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకు తీసుకున్నామని వివరించారు. ఎల్‌అండ్‌టీకి చెల్లించేందుకు ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి 3 శాతం వడ్డీపై రుణం తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నామని, అందుకోసం రూ.80 కోట్లు కూడా చెల్లించామని చెప్పారు. రుణం విడుదల కావాల్సిన సమయంలో కేంద్రంలోని పెద్దల ఆదేశంతో ఆపేశారని ఆరోపించారు.

ఎల్‌అండ్‌టీ 9 శాతం వడ్డీకి రుణాలు తెచ్చుకుంది. మేం 3.5 శాతం వడ్డీకే తీసుకోవాలని నిర్ణయించాం. దీనివల్ల నెలవారీ వడ్డీ భారం రాష్ట్రానికి తగ్గుతుంది.మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపకుండా, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం రాకుండా కేటీఆర్, కిషన్ రెడ్డిలు అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. కేంద్రం ఏ ప్రతిపాదన చేస్తే దాని ప్రకారం ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, లిఖితపూర్వకంగా చెబితే అలాగే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఒకవేళ మెట్రోను పూర్తిగా కేంద్రమే నిర్మించినా అభ్యంతరం లేదని చెప్పారు. కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదని, విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలన్నా కేంద్ర ఆమోదం తప్పనిసరని గుర్తు చేశారు.హైదరాబాద్ మెట్రో రోజువారీ లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. మొదటి దశ టేకోవర్‌తో ప్రభుత్వం నిర్వహణ బాధ్యత తీసుకోవడం వల్ల సేవలు మెరుగుపడే అవకాశం ఉంది.

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. గరిష్ఠంగా రూ.1.10 లక్షలు జమ!
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. గరిష్ఠంగా రూ.1.10 లక్షలు జమ!

రెండో దశ విస్తరణతో నగరంలోని మరిన్ని ప్రాంతాలు అనుసంధానమైతే ట్రాఫిక్ సమస్య తగ్గి, ప్రజా రవాణా సులభతరం అవుతుంది. అయితే దీనికి కేంద్ర సహకారం అత్యంత అవసరం. సీఎం చెప్పినట్లు రాజకీయ కారణాలు కాకుండా అభివృద్ధి దృష్టితో నిర్ణయాలు తీసుకుంటేనే మెట్రో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ముందుకు సాగుతుంది.హైదరాబాద్ మెట్రో ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. మొదటి దశ ప్రభుత్వం చేతిలోకి వచ్చినా, రెండో దశ కోసం కేంద్రం-రాష్ట్రం సమన్వయం కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+