కనీస ధర రూ.10: హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ల ధరలు ఇవే
హైదరాబాద్: అందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరలపై ప్రకటన శనివారం సాయంత్రం వెలువడింది. నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
దీంతో నవంబర్ 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు.

మొదటి రెండు స్టేషన్ల వరకు టికెట్ ధర రూ. 10 గా ఉంటుంది. ఫస్ట్ స్టేజీ నుంచి లాస్ట్ స్టేజీ వరకు ప్రయాణిస్తే ధర రూ. 60 ఉంటుంది. ఒక స్టేషను, రెండు స్టేషన్ల వరకు రూ. 10 టికెట్ ఉంటుంది.
మెట్రో ధరలు ఇలా..
కనీస ధర రూ. 10
2కి.మీ- రూ. 10
2-4కి.మీ -రూ. 15
4-6కి.మీ - రూ. 25
6-8కి.మీ - రూ. 30
8-10కి.మీ- రూ. 35
10-14కి.మీ-రూ. 40
14-18కి.మీ-రూ. 45
18-22కి.మీ -రూ. 50
22-28కి.మీ- రూ. 55
26 కి.మీ కంటే ఎక్కవ ప్రయాణించే వారి నుంచి రూ.60 వసూలు చేయనుంది.












Click it and Unblock the Notifications