హైదరాబాద్ క్రైమ్: కత్తులు, వేట కొడవళ్ళతో వెంటాడి వేటాడి దారుణ హత్య!
హైదరాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో ఒక వ్యక్తి ని వైన్ షాప్ లోపలే దారుణంగా హతమార్చారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్ళతో వ్యక్తిపై దాడి చేసిన దుండగులు అతడిని దారుణంగా హతమార్చారు.
సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణ ఘటనలో.బాధితుడు ప్రాణభయంతో పారిపోయి సమీపంలోని సుప్రీమ్ వైన్స్ లోకి ప్రవేశించాడు. అక్కడ దాక్కుని తన ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించాడు. కానీ హంతకులు అతన్ని వదలలేదు. వారు వైన్ షాప్ లోపలికి వెళ్లి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి తీవ్రత వల్ల బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఘటన తర్వాత నిందితులు ఒక కారులో ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. స్థానికులు సమాచారం అందించగానే నాగోల్ పోలీసులు వెంటనే స్థలానికి చేరుకున్నారు. వారు వైన్ షాప్ పరిస్థితిని పరిశీలించి అవసరమైన ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
మృతుడు ఎవరో, అతన్ని ఎందుకు టార్గెట్ చేశారో, పాత కక్షలు ఉన్నాయా లేదా మరేదైనా వివాదం కారణమా అనే అంశాలపై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గుర్తింపు వివరాలను తేల్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వైన్ షాప్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
హంతకులు ఏ వాహనంలో వచ్చారు.. ఎంతమంది ఉన్నారు, బాధితుడిని ఎక్కడి నుంచి వెంటాడారు, హత్య తర్వాత ఏ మార్గంలో పారిపోయారు వంటి వివరాలను తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. రోజువారీ జీవితంలో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం ప్రజల భద్రతను పరిశీలిస్తోంది.
పోలీసులు త్వరగా నిందితులను పట్టుకుని న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసులు అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో ఇలాంటి హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అలెర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసు పై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
