నారాయణ టేపుల కలకలం: శ్రీలత కేసు తవ్వుతున్నారు, డొంక కదులుతోందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థలకు చెందిన ఆడియో టేప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆరోపణల తీవ్రతను గ్రహించిన పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు.

అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం మినహా నారాయణ విద్యాసంస్థలపై ఎలాంటి స్పష్టమైన ఫిర్యాదులూ అందలేదు. అయినప్పటికీ పోలీసులు విస్తృత దర్యాఫ్తు చేస్తున్నారు.

శ్రీలత కేసును తవ్వి తీస్తున్న పోలీసులు

శ్రీలత కేసును తవ్వి తీస్తున్న పోలీసులు

ఏడాది క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంస్థ మాజీ ఉద్యోగిని శ్రీలత కేసును కూడా తవ్వి తీస్తున్నారు. వారం క్రితం వెలుగులోకి వచ్చిన నారాయణ ప్రిన్సిపాల్‌ సరితా అగర్వాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీన్ గౌడ్‌ మధ్య ఫోన్‌ సంభాషణే డొంకను కదిలించింది. ఇప్పుడు అది ఆడియో రూపంలో హల్‌చల్‌ చేస్తోంది.

ఆడియో టేప్ సంచలనం, డొంక కదులుతోంది

ఆడియో టేప్ సంచలనం, డొంక కదులుతోంది

ఉన్నతాధికారులు సంస్థలో పలువురు మహిళలను లైంగికంగా వేధించారని, బాధితుల్లో తాను కూడా ఉన్నానని, వారి కారణంగానే గతంలో నారాయణ గ్రూప్‌లో పని చేసిన శ్రీలత ఆత్మహత్య చేసుకుందని సరితా అగర్వాల్‌ వెల్లడించినట్లు ఆడియో టేపుల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

శ్రీలత మృతిపై భర్త ఫిర్యాదు ఇలా`

శ్రీలత మృతిపై భర్త ఫిర్యాదు ఇలా`

హిమాయత్‌నగర్‌ నారాయణ శాఖలో రెండేళ్ల పాటు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన శ్రీలత ట్రైడెంట్‌ స్కూల్లో చేరారు. గతేడాది నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ట్రైడెంట్‌ ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డబ్బులిచ్చి అలా మాట్లాడించారని ట్విస్ట్

డబ్బులిచ్చి అలా మాట్లాడించారని ట్విస్ట్

మరోవైపు, ఉన్నతాధికారులను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఏబీవీపీ హిమాయత్‌నగర్‌లోని నారాయణ కళాశాలపై దాడి చేసింది. అదేరోజు మీడియా ముందుకు వచ్చిన సరితా అగర్వాల్‌ తనకు డబ్బులిచ్చి అలా మాట్లాడించారని, నారాయణ కళాశాలలో అంతా సవ్యంగానే ఉందని మాట మార్చారు.

నవీన్‌ను విచారిస్తే వ్యవహారాలు వెలుగులోకి

నవీన్‌ను విచారిస్తే వ్యవహారాలు వెలుగులోకి

తనతో ఫోన్లో మాట్లాడిన నవీన్ గౌడ్‌ తనను వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచి పరారీలో ఉన్న నవీన్ గౌడ్‌ ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనను శనివారం ఉప్పల్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నవీన్‌ను విచారిస్తే నారాయణ విద్యాసంస్థల్లో వ్యవహారాలన్నీ బయటికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Uppal police on Saturday arrested Naveen Goud, the vice-principal of Narayana College’s Ramanthapur branch for allegedly threatening Saritha Agarwal, Principal of the same branch, over an audio note purportedly about the Narayana Group of Institutions. He was picked up from Rajanna-Sircilla district by a special team from the Uppal police station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి