అద్దెకోసం వచ్చి దొంగతనాలకు పాల్పడే జంట

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:పెళ్ళై భార్య ఉండగానే చనువుగా ఉన్న మరో మహిళను పెళ్ళిచేసుకొన్నాడు. అంతే కాదు డబ్బుల సంపాదన కోసం ఉదయం పూట దొంగతనాలు చేస్తున్నారు.యధేచ్చగా చోరీలకు పాల్పడి వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తున్నారు.

అంబర్ పేట శంకర్ నగర్ కు చెందిన ఒగ్గు శ్రీనివాస్. గతంలో ఓ కంపెనీలో పనిచేసేవాడు. అతనికి నెలవారీ జీతం రూ.7 వేలు.అయితే అక్కడే పరిచయమైన రేణుకను ఆయన రెండో వివాహం చేసుకొన్నాడు.

Hyderabad police arrested couple for theft on Sunday

ఆమె కూడ ఓ ఇంట్లో పనిచేసేది. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన సరిగా లేదని ఉద్యోగం నుండి తొలగించారు. అయితే వారిద్దరికి పూట గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకుగాను దొంగతనాలు చేయాలని ఎంచుకొన్నారు ఆ దంపతులు.

సులువుగా డబ్బులను సంపాదించే మార్గంతో పాటుగా ఈ డబ్బుతో జల్సాలు చేసేవారు ఆ దంపతులు.ఉదయంపూట చక్కగా తయారై స్కూటీపై బయలుదేరేవారు. టూలెట్ అనే బోర్డులు ఉన్న ఇంటి వద్ద ఆగేవారు.

ఇంటికోసం వెతుకుతున్నామంటూ అక్కడి వాచ్ మెన్ , యజమానులను నమ్మించేవాడు. ఇల్లు, ప్లాట్స్ ను పరిశీలించే ఉద్దేశ్యంతో లోపలకు చేరేవాడు. ఆ సమయంలో చుట్టుపక్కల తాళం వేసిన ఇళ్ళను గమనించేవాడు.

అక్కడి పరిస్థితులను అంచనావేసేందుకు రెక్కీ నిర్వహించేవాడు. అదునుచూసీ ఇంటితాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. అక్కడ దొరికిన విలువైన వస్తువులు, నగదుతో అదే స్కూటీపై నెమ్మదిగా జారుకొనేవారు.

ఇల్లు అద్దెకు కావాలంటూ సుమారు 100 ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వందకుపైగా సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. చివరకు ఒక ఆధారంతో తీగలాగితే అంబర్ పేటలో దొరికారు. వారిద్దరిని ఆదివారం నాడు అరెస్టు చేశారు పోలీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad police arrested couple for theft on Sunday.they were theft above 100 houses in Hyderabad. police arrested them on sunday.
Please Wait while comments are loading...