హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిందితులు అరెస్ట్: కుక్క పిల్లలను సజీవ దహనం చేశారిలా (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మూడు కుక్క పిల్లలను చితి పేర్చి సజీవంగా దహనం చేసిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుక్క పిల్లలను దారుణంగా సజీవ దహనం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు శ్రేయ పారోప్‌కారీ, జయసింహ నుగ్గెహల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు ఆధారంగా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనలో నిందితులంతా మైనర్లు కావడంతో వారిని బాలల నేరస్థుల గృహానికి (జువైనల్ హోం) తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ముషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం..

 కుక్క పిల్లలు సజీవ దహనం

కుక్క పిల్లలు సజీవ దహనం


రాంనగర్ దయారా మార్కెట్ కమాన్ వద్ద ఈ నెల 14న మధ్యాహ్నం పటాన్‌బస్తీకి చెందిన ఎనిమిది మంది మైనర్లు క్రికెట్ ఆడుతుండగా మూడు కుక్కలు పిల్లలకు వారి కంట పడ్డాయి. ఆ కుక్క పిల్లలను పక్కనే బహదూర్‌ జంగ్‌ శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

 కుక్క పిల్లలు సజీవ దహనం

కుక్క పిల్లలు సజీవ దహనం


కట్టెలను పేర్చి ఆ తర్వాత కుక్క పిల్లలకు తాళ్లుకట్టి మంటల్లో వేసి, కేరింతలు కొడుతూ పైశాచికానందం పొందారు. మంటలకు తాళలేక బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన కుక్క పిల్లలను కట్టెలతో కొట్టి మళ్లీ మంటల్లోకే నెట్టారు.

నిందితులు అరెస్ట్: కుక్క పిల్లలను సజీవ దహనం చేశారిలా (ఫోటోలు)

నిందితులు అరెస్ట్: కుక్క పిల్లలను సజీవ దహనం చేశారిలా (ఫోటోలు)


కుక్క పిల్లలు సజీవ దహనంఇదంతా సెల్‌ఫోన్లతో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఘటన వెలుగు చూసింది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఈ వీడియోను చూసిన పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ ప్రతినిధి, న్యాయవాది శ్రేయ నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

 కుక్క పిల్లలు సజీవ దహనం

కుక్క పిల్లలు సజీవ దహనం


దాంతో ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సీపీ ముషీరాబాద్ పోలీసులకు ఆదేశించారు. సీఐ బిట్టు మోహన్‌కుమార్‌, ఇతర పోలీసు సిబ్బంది, ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

కుక్క పిల్లలు సజీవ దహనం

కుక్క పిల్లలు సజీవ దహనం


కాలిన కుక్కపిల్లల శరీర భాగాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. జంతు చట్టం ప్రకారం నిందితులపై ఐపీసీ 428 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

 కుక్క పిల్లలు సజీవ దహనం

కుక్క పిల్లలు సజీవ దహనం

సీపీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకొన్నామని, వారిపై ఐపీసీ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశామని ముషీరాబాద్ పోలీసులు తెలిపారు.

కుక్క పిల్లలు సజీవ దహనం

కుక్క పిల్లలు సజీవ దహనం


అభం శుభం తెలియని కుక్క పిల్లలను అత్యంత దారుణంగా సజీవంగా దహనం చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వీరిని వదిలేస్తే భవిష్యత ఇలాంటి ఘటనలు పునరావృత్తమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

English summary
In a shocking case of animal cruelty, the Hyderabad police, following a complaint from Humane Society International India, arrested a group of eight teenagers for burning alive a litter of three puppies in the Musheerabad area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X