హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాకెట్: భార్య కిడ్నీనే అమ్మేసిన ఏజెంట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి డబ్పులు ఎరవేసి, వారి కిడ్నీలను కాజేస్తున్న నలుగురు నేరగాల్లను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఏడాదికాలంగా ఇది సీక్రెట్‌గా జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా సమాచారం అందడంతో పశ్చిమ మండల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి హైదరాబాదులో ఉంటున్న రాఘవేందర్, అశోక్, సంజయ్ కుమార్ జైన్, షిర్డీ వైద్యుడు హిర్దేశ్ సక్సేనాలను అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి వీరంతా హైదరాబాదులోని ఎల్లారెడ్డిగూడలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో తాము పదిమంది నుండి మూత్రపిండాలు తీసుకున్నామని చెప్పారు. మరో ఎనిమిది మందితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. నిందితుల నుండి తొమ్మిది పాస్ పోర్టులు, వైద్య పరీక్షల రిపోర్టులు, ఓ కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

 కిడ్నీ రాకెట్

కిడ్నీ రాకెట్

షిర్డీలో నివాసముంటున్న హిర్దేష్ సక్సేనా, చెన్నైకి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తికి ఇంటర్నెట్ల ద్వారా పరిచయమయ్యాడు.

 కిడ్నీ రాకెట్

కిడ్నీ రాకెట్

రామ్ కుమార్ అప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించి వారి నుండి కిడ్నీ తీసుకున్నందుకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఇచ్చేవాడు.

 కిడ్నీ రాకెట్

కిడ్నీ రాకెట్

భారత్‌లోని ఆసుపత్రుల్లో మూత్రపిండాలను తీసుకుంటే ఇబ్బందులను భావించి దాతలను శ్రీలంకలోని కొలంబో, ఇరాన్‌లోని టెహ్రాన్‌లకు పంపేవాడు. కొలంబోలో నాలుగు ఆసుపత్రులు, టెహ్రాన్‌లో ఒక ఆసుపత్రి వైద్యులతో వీరి నిత్యం సంప్రదించేవారు.

 కిడ్నీ రాకెట్

కిడ్నీ రాకెట్

మూత్రపిండాలు అవసరమైన వారు రూ.30 లక్షల నుండి రూ.50 లక్షలు చెల్లిస్తారు. డాక్టర్ హిర్దేష్, రామ్ కుమార్‌లు కిడ్నీ ఇస్తే డబ్బులిస్తామని ఇంటర్నెట్లో ప్రచారం చేశారు.

కిడ్నీ రాకెట్

కిడ్నీ రాకెట్

వారు చెన్నై, బెంగళూరు, హైదారాబాదులలో ఏజెంట్లను నియమించుకున్నారు.

 కిడ్నీ రాకెట్

కిడ్నీ రాకెట్

హైదారబాదులోని రాఘవేందర్ ఆర్థిక ఇబ్బందులతో మూత్రపిండం విక్రయించాలని ఏడాది కిందట నిర్ణయించాడు. ఓ ఏజెంట్ తన భార్య కిడ్నీని కూడా అమ్మేశాడు.

English summary
The Hyderabad Police on Monday busted a kidney racket and arrested a Shirdi-based doctor and three agents who were involved in the illegal trade. The gang was arranging for donors and recipients from all over the country and taking them to hospitals in Tehran and Colombo for surgeries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X