హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలకు భద్రత: డిజిపి, ఫేస్‌బుక్ లైక్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా రక్షణకు, భద్రతకు ప్రభుత్వం నియమించిన ఐఏస్‌, ఐపీఎస్‌ అధికారుల కమిటీ ఓ అడుగు ముందుకేసింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయానికి అనుగుణంగా డిజిపి అనురాగ్ శర్మ కసరత్తు ప్రారంభించారు. పోలీస్ శాఖలో సంస్కరణలపై ప్రత్యేక టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసినట్లు డిజిపి సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. దేశవిదేశాల్లో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను రాష్ట్రంలో అమలు చేయాలన్న సిఎం నిర్ణయానికి తగ్గట్టుగా ప్రజలతో మమేకమై సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించామన్నారు.

రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిని భారీ స్థాయిలో పెంచడానికి అడుగులు వేస్తున్నామని తెలిపారు. మహిళలకు సివిల్ పోలీస్ నియామకాల్లో 33శాతం, ఆర్మ్‌డ్ పోలీస్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

మహిళా రక్షణకు, భద్రతకు ప్రభుత్వం నియమించిన ఐఏస్‌, ఐపీఎస్‌ అధికారుల కమిటీ ఓ అడుగు ముందుకేసింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయానికి అనుగుణంగా డిజిపి అనురాగ్ శర్మ కసరత్తు ప్రారంభించారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

పోలీస్ శాఖలో సంస్కరణలపై ప్రత్యేక టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసినట్లు డిజిపి సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ లోగోతో పాటు వాహనాలు, తదితరాల అంశాలను 40,670 మంది మెచ్చుకున్నారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

దేశ విదేశాల్లో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను రాష్ట్రంలో అమలు చేయాలన్న సిఎం నిర్ణయానికి తగ్గట్టుగా ప్రజలతో మమేకమై సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిని భారీ స్థాయిలో పెంచడానికి అడుగులు వేస్తున్నామని తెలిపారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

మహిళలకు సివిల్ పోలీస్ నియామకాల్లో 33శాతం, ఆర్మ్‌డ్ పోలీస్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ప్రతీ సబ్ డివిజన్‌లో ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు పెద్ద సమస్య కాదని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సబ్ డివిజన్‌లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

వీటిని దృష్టిలో పెట్టుకొని రెండు కమిషనరేట్లు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఠాణాలో ఓ మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అనురాగ్ శర్మ

అనురాగ్ శర్మ

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇంటర్‌సెప్టర్ వాహనాలను భారీ సంఖ్యలో పెంచాలని నిర్ణయించినట్లు డిజిపి తెలిపారు. వీటితోపాటు ఆర్మ్‌డ్ ఇంటర్‌సెప్టర్ వాహనాలను కూడా తీసుకువస్తామన్నారు.

హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ప్రతీ సబ్ డివిజన్‌లో ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు పెద్ద సమస్య కాదని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సబ్ డివిజన్‌లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రెండు కమిషనరేట్లు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఠాణాలో ఓ మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇంటర్‌సెప్టర్ వాహనాలను భారీ సంఖ్యలో పెంచాలని నిర్ణయించినట్లు డిజిపి తెలిపారు. వీటితోపాటు ఆర్మ్‌డ్ ఇంటర్‌సెప్టర్ వాహనాలను కూడా తీసుకువస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులపై ప్రత్యేక నిఘా వ్యవస్థను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు నెలల్లో ప్రతీ పోలీస్ స్టేషన్‌లో బీట్ మొబైల్ పెట్రోలింగ్‌ను పటిష్టం చేస్తున్నామని డిజిపి తెలిపారు. ఆయుధాలు కలిగిన మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి నేరాల అదుపునకు ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ లోగోతో పాటు వాహనాలు, తదితరాల అంశాలను 40,670 మంది మెచ్చుకున్నారు. సిఎం కెసిఆర్ చేతుల మీదుగా విడుదలైన తెలంగాణ స్టేట్ పోలీస్ లోగో, పెట్రోలింగ్ వాహనాల ప్రారంభం తదితర కార్యక్రమాలను పోలీస్ అధికారులు ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశారు.

English summary

 Telangana Director General of Police (DGP) Anurag Sharma said interceptor vehicles will be stationed at key junctions in the limits of Hyderabad and Cyberabad police commissionerates to respond quickly in case of any emergency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X