హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హై ప్రొఫైల్ కిడ్నాప్ యత్నం: ముగ్గురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో వ్యాపారులను కిడ్నాప్‌ చేసి హత్యలకు కుట్ర పన్నుతున్న ఓ ముఠాను నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో ఓ మాజీ నక్సలైట్‌ సైతం ఉన్నాడు. వారి వద్ద నుంచి ఓ అమెరికా తయారి రివాల్వర్‌తో పాటు తపంచా , 40 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. ఈ మేరకు సోమవారం నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ లింబారెడ్డి వివరాలు వెల్లడించారు. మౌలాలి హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న ఎస్‌. అప్పలత్రినాధవర్మ అలియాస్‌ రఘు అలియాస్‌వర్మ(32) ఇతను రియల్‌ఏస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తుంటాడు.

కె.రాజిరెడ్డి(52) ఇతను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌ ఇతను మాజీ నక్సలైట్‌, మలక్‌పేటకు చెందిన జె.నాగరాజు(39) కెమికల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చిలకలగూడకు చెందిన లారీ డ్రైవరు డి.దామోదర్‌(48) అప్పల త్రినాధ వర్మ తూర్పుగోదావరి జిల్లా పోలవరంకు చెందినవాడు. 2003 సంవత్సరంలో హైదరాబాద్‌నగరానికి వచ్చి షాపూర్‌నగర్‌ సుభాష్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటు రియల్‌ఏస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో రైస్‌పుల్లింగ్‌ వ్యాపారం పేరిట అమాయకులను మోసం చేస్తున్నట్లు వివరించాడు. ఈ క్రమంలో వర్మకు మాజీ నక్సలైట్‌ రాజిరెడ్డితో పాటు నాగరాజు, దామోదర్‌లతో స్నేహం కుదిరి ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఈ క్రమంలో వ్యాపారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యచేస్తే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చునని పథకం పన్నినట్లు వెల్లడించారు.

Hyderabad police foil three high profile kidnap attempts

దీంతో మాజీ నక్సలైట్‌ రాజిరెడ్డి , వర్మ ఇద్దరు కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌ వెళ్లి రూ. 60 వేల రూపాయలను అనుపమ్‌అనే అక్కడి వ్యక్తి ద్వారా ఒక పిస్టల్‌, ఒక తపంచా, బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. అయుధాలు సమకూర్చుకున్న తర్వాత ఈ గ్యాంగ్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ మెస్‌ యజమానికి , బాలాజీనగర్‌లోని ఓ వైన్‌షాప్‌ యజమానిని, ఆలేరులోని ఓ మందిరం ట్రస్టీని కిడ్నాప్‌ చేయడానికి యత్నించి విఫలం అయినట్లు డిసిపి వివరించారు.

ఈ క్రమంలో సోమవారం వర్మ, రాజిరెడ్డిలు మారుతి స్వీఫ్ట్‌డిజైర్‌ కారు నెంబరు ఏపి 1టివి 3700 లో ఆయుధాలు కలిగి ప్రయాణిస్తుండగా సికింద్రాబాద్‌లోని పికెట్‌ ప్రాంతంలో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నకిలీ అధార్‌ కార్టులతో సహా ఆయుధాలు ఉండడంతో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, కుషాయిగూడ ప్రాంతంలో మరో ఇద్దరు నాగరాజు, దామోదర్‌లను సైతం అరెస్ట్‌ చేసినట్లు డిసిపి వెల్లడించారు.

అప్పల త్రినాధ వర్మపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇతనిపై పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు, కెపిహెచ్‌బిలో హత్యకేసు, కుషాయిగూడలో అక్రమ అయుధాల కేసుతో పాటు తప్పించుకు తిరుగుతున్న కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి అమెరికా తయారి ఒక పిస్టల్‌, తపంచా, 21 రౌండ్ల 8 ఎంఎం బుల్లెట్లు, 19 బులెట్లు 7.65 ఎంఎం వి, మారుతిస్వీఫ్ట్‌ డిజైర్‌కారు, రెండు నకిలీ వాహన నెంబరు ప్లేట్లు, ఒక తాడు,ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ ఆధార్‌, ఓటర్‌ ఐడి కార్డులు, డెబిట్‌, క్రెడిట్‌కార్టులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని మారెడ్‌పల్లి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

English summary
The commissioner’s task force team foiled a kidnap bid by a former Naxalite and four others. The gang had planned to extort money from three traders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X