హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫుట్‌పాత్‌పై ఇలా చాటు చేసి, స్త్రీకి మహిళా పోలీసులు పురుడు పోశారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని నారాయణగూడ శాంతి థియేటర్‌ దగ్గర ఓ మహిళ రోడ్డుపక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై ప్రసవించింది. వెంటనే స్పందించిన నారాయణగూడ మహిళా పోలీసులు ప్రసవం కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఆ మహిళకు పురుడుపోశారు.

అనంతరం తల్లి, బిడ్డను కోటిలోని మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రసవం కోసం మహిళా పోలీసులు చూపిన చొరవను స్థానికులు అభినందించారు.

ప్రసవించిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సదరు మహిళా పోలీసులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

మిట్టమధ్యహ్నం భానుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండగా ఓ నిండు గర్భిణి రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

ఒక్క అడుగూ ముందుకు నడవలేకపోయింది. బాధను బిగబడుతూ ఉన్నచోటనే కూలబడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆ మహిళ దగ్గరికి వచ్చారు.

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

ఆస్పత్రికి తీసుకెళ్లే టైమ్ లేకపోవడంతో చుట్టుపక్కనవాళ్లనడిగి చీరలు తెప్పించి ఫుట్ పాత్ చూట్టూ చీరలు అడ్డంగా కట్టి, మహిళా కానిస్టేబుళ్లే పురుడుపోశారు.

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

పుట్టిన పండంటి మగబిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని, అప్పటికప్పుడు తెప్పించిన వస్త్రాల్లో చుట్టి పడుకోబెట్టారు.

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

అనంతరం బాబును, తల్లిని ఆంబులెన్స్ లో కోఠిలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు.

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

హైదరాబాద్ లోని నారాయణగూడా శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుందీ సంఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

English summary
In a shocking incident, a 38-year-old woman delivered a baby on the footpath in front of a cinema theatre at Narayandguda on Tuesday. She was later shifted to Koti Maternity Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X