Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంతోష్‌నగర్ రేప్ ఫిర్యాదు ఉత్తదేనా?: బాధితురాలిగా నాటకమాడిన యువతి! ఏం తేల్చారంటే.?

హైదరాబాద్: దారి మళ్లించి, తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. అయితే, అత్యాచారం జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఆటో డ్రైవర్ అత్యాచారం చేశారంటూ యువతి ఫిర్యాదు

ఆటో డ్రైవర్ అత్యాచారం చేశారంటూ యువతి ఫిర్యాదు

ఈ నేపథ్యంలో యువతి తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ల్యాబ్ టెక్నీషియయన్‌గా పనిచేస్తున్న యువతి.. ఆగస్టు 17న ఇంటి నుంచి విధులకు వెళ్లింది. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు వెళ్లింది. అయితే, ఆలస్యంగా రావడంతో కుమార్తెను తల్లిదండ్రులు ప్రశ్నించారు. తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని యువతి వారికి చెప్పింది. దీంతో యువతితోపాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.

తప్పుడు ఫిర్యాదు? యువతిపై అత్యాచారం కూడా జరగలేదు?

తప్పుడు ఫిర్యాదు? యువతిపై అత్యాచారం కూడా జరగలేదు?

యువతి ఆటో ఎక్కిన సమయం, ఆమె చెప్పే అంశాలకు పొంతన లేదని నిర్ధారణకు వచ్చారు. యువతిది తప్పుడు ఫిర్యాదుగా భావించిన పోలీసులు ఆెను పూర్తిస్థాయిలో ప్రశ్నించారు. అంతేగాక, యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరగలేదని తేలినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడా కూడా ఆనవాళ్లు దొరకలేదు. మంగళవారం రాత్రి సంతోష్‌నగర్‌లోని యాదగిరి థియేటర్ వద్ద ఆటో ఎక్కినట్లు పోలీసులకు చెప్పిన యువతి.. ఆటో ఎక్కిన తర్వాత మరొక ఇద్దరు యువకులు వెనకల తనపక్కనే కూర్చున్నారని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిన తర్వాత తాన స్పృహకోల్పోయానని తెలిపింది. ఆ తర్వాత తేరుకుని ఇంటికి చేరుకున్నట్లు చెప్పింది.

నగరంలో ఇది రెండో ఘటన

నగరంలో ఇది రెండో ఘటన

లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అత్యాచారం జరిగినట్లు ఆమె తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేల్చారు. పోలీసుల విచారణలోనూ తాజాగా ఆ యువతి తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది. తన ప్రియుడికి నిశ్చితార్థం అయిన నేపథ్యంలోనే అతడ్ని ఈ కేసులో ఇరికించాలని ఆ యువతి నాటకమాడినట్లు అనుమానిస్తున్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఓ యువతి ఇలాంటి తప్పుడు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇలా తప్పుడు ఫిర్యాదుల కారణంగా అసలైన బాధితులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌రేప్‌పై కొనసాగుతున్న విచారణ

గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌రేప్‌పై కొనసాగుతున్న విచారణ

ఇది ఇలావుండగా, గాంధీ ఆస్పత్రి సామూహిక అత్యాచార ఘటనలో మరో బాధితురాలి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు చిలకలగూడ పోలీసులు. ఆగస్టు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అక్కా-చెల్లెలు ఎక్కడున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కోనసాగిస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో అతడు నోరు మెదపడం లేదు. గాంధీ ఆస్పత్రి సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్‌అలీ పోలీసులను ఆదేశించారు. ఆస్పత్రిలో రోగి చికిత్స పొందిన పరిస్థితులు, ఫిర్యాదిదారు ఇచ్చిన సమాచారం విరుద్ధంగా ఉండడంతో పోలీసులు ఆ దిశగా దృష్టిసారించారు. అత్యాచారం జరిగిందని చెబుతున్న మహిళకు మెడికల్ టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్ వస్తే మిస్టరీ వీడే అవకాశముంది. మరోవైపు.. గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తునకు తోడు ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు సమగ్ర విచారణకు ఆదేశించారు గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు.

Recommended Video

    Kalva Sujatha questioned what would have happened to the police system
    ఇద్దరిపై అత్యాచారం, లభించని మహిళ ఆచూకీ

    ఇద్దరిపై అత్యాచారం, లభించని మహిళ ఆచూకీ

    కిడ్నీ ట్రీట్‌మెంట్‌ కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆగస్టు 5న గాంధీకి తీసుకొచ్చారు. వెంట ఆమె చెల్లెలు కూడా వచ్చారు. వాళ్లకు దూరపు బంధువైన ఉమామహేశ్వర్‌.. గాంధీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను, సెక్యూరిటీ గార్డు మరికొందరు కలిసి ఓ గదిలో బంధించి అత్యాచారినికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే, ఆమె సోదరి కన్పించకుండా పోవడం మిస్టరీగా మారింది. ఒకవైపు పోలీసులతో పాటు మరోవైపు ఆస్పత్రిలో అంతర్గత విచారణ కొనసాగుతుండటంతో త్వరలోనే అసలు విషయం తేలనుంది. అయితే, ఆస్పత్రిలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలున్నాయని, అత్యాచారం జరిగే అవకాశం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+