హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ కోసం చిన్నారి కిడ్నాప్: మెసేజ్‌లతో డబ్బుల కోసం బెదిరింపులు, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటూ కిడ్నాప్‌నకు గురైన రెండేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. నవంబర్ 14న కిడ్నాప్‌కు గురైన ఆ చిన్నారి దాదాపు 30రోజల తర్వాత పోలీసుల సాయంతో తమ ఒడికి చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న కేసు వివరాలను మాదాపూర్‌ డీసీపీ కార్తీకేయ సోమవారం మీడియాకు వివరించారు.

మూసాపేట పరిధి రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన అబ్దుల్‌ కలీం, షాహినాబేగం కుమారుడు జియాఉర్‌ రహమాన్‌ అలియాస్‌ హసన్‌(2) నవంబర్ 14న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. కిడ్నాప్‌గా అనుమానించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, డిసెంబర్ 11న బాలుడి మేనమామైన సాజిద్‌ హుస్సేన్‌ సెల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌ నంబరు నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది.

రూ.2లక్షలు ఇవ్వాలని, ఆ మొత్తంతో డిసెంబర్ 12వ తేదీన బేగంపేట రైల్వే స్టేషన్‌కు రావాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు వివరించారు. పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మఫ్టీలో స్టేషన్‌కు చేరుకున్నారు. డబ్బు కోసం బాలుడి తండ్రి కలీం వద్దకు వచ్చిన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, మరో వ్యక్తి జనార్ధన్‌ను పట్టుకున్నారు.

కాగా, బాలుడిని తానే అపహరించి ఓ వ్యక్తికి అమ్మినట్లు ప్రవీణ్‌ అంగీకరించారు. వెంటనే పోలీసులు, బాలుడి బంధువులు కలిసి నిందితులను తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి ఆదివారం రాత్రి వెళ్లి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రహమాన్‌ను వెంట పెట్టుకుని సోమవారం నగరానికి చేరుకున్నారు.

బాలుడి అపహరణ కేసులో మూసాపేట రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన ఎన్‌ ప్రవీణ్‌కుమార్‌ అలియాస్‌ ప్రవీణ్‌(24) సూత్రధారిగా వ్యవహరించినట్లు డీసీపీ వెల్లడించారు. ఇతను మరో మిత్రుడైన గణేష్‌తో కలిసి రహమాన్‌ను అపహరించాడు. ఈ ఇద్దరూ కలిసి పశ్చిమ గోదావరి జిల్లా రాజోలుకు చెందిన రామకృష్ణ(19), దుర్గాప్రసాద్‌(23) సాయంతో అదే జిల్లా రామరాజులంక గ్రామానికి చెందిన బందెల రాజుకు రూ.50 వేలకు ఆ బాలుడిని విక్రయించారు.

తిరిగి నగరానికి చేరుకున్న ప్రవీణ్‌కు అప్పటికే తమ బాబు ఆచూకీ కోసం రహమాన్‌ ఫొటోతో సహా వేసిన గోడపత్రికలు అక్కడక్కడా కనిపించాయి. అందులో బాలుడి మేనమామైన సాజీద్‌ హుస్సేన్‌ ఫోన్‌ నంబరు కనిపించడంతో ప్రవీణ్‌కు దురాశ పుట్టింది. బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజవచ్చని భావించాడు. సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపడంతో కేసు చిక్కుముడి వీడటానికి కారణమైంది.

ఈ కేసులో జనార్ధన్‌ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌ విషయం తెలియక ప్రవీణ్‌ సూచన మేరకే రైల్వే స్టేషన్‌కు వచ్చాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రవీణ్‌పై గతంలో కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లోనే బైక్‌ చోరీ కేసు నమోదై ఉంది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు గణేష్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు, సీఐ కె.పురుషోత్తం, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సురేందర్‌ పాల్గొన్నారు.

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

ఇంటి ముందు ఆడుకుంటూ కిడ్నాప్‌నకు గురైన రెండేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. నవంబర్ 14న కిడ్నాప్‌కు గురైన ఆ చిన్నారి దాదాపు 30రోజల తర్వాత పోలీసుల సాయంతో తమ ఒడికి చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నిందితుల అరెస్ట్

నిందితుల అరెస్ట్

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న కేసు వివరాలను మాదాపూర్‌ డీసీపీ కార్తీకేయ సోమవారం మీడియాకు వివరించారు.

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

మూసాపేట పరిధి రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన అబ్దుల్‌ కలీం, షాహినాబేగం కుమారుడు జియాఉర్‌ రహమాన్‌ అలియాస్‌ హసన్‌(2) నవంబర్ 14న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు.

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

కిడ్నాప్‌గా అనుమానించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, డిసెంబర్ 11న బాలుడి మేనమామైన సాజిద్‌ హుస్సేన్‌ సెల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌ నంబరు నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది.

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

రూ.2లక్షలు ఇవ్వాలని, ఆ మొత్తంతో డిసెంబర్ 12వ తేదీన బేగంపేట రైల్వే స్టేషన్‌కు రావాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు వివరించారు.

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

కిడ్నాపర్ల బెదిరింపు సందేశాలు

పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మఫ్టీలో స్టేషన్‌కు చేరుకున్నారు. డబ్బు కోసం బాలుడి తండ్రి కలీం వద్దకు వచ్చిన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, మరో వ్యక్తి జనార్ధన్‌ను పట్టుకున్నారు.

కిడ్నాపర్లకు అందించేందుకు డబ్బులు

కిడ్నాపర్లకు అందించేందుకు డబ్బులు

కాగా, బాలుడిని తానే అపహరించి ఓ వ్యక్తికి అమ్మినట్లు ప్రవీణ్‌ అంగీకరించారు. వెంటనే పోలీసులు, బాలుడి బంధువులు కలిసి నిందితులను తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి ఆదివారం రాత్రి వెళ్లి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రహమాన్‌ను వెంట పెట్టుకుని సోమవారం నగరానికి చేరుకున్నారు.

ప్రియురాలి కోసమే..

కాగా, తన ప్రియురాలికి బహుమతి ఇవ్వడం కోసమే కిడ్నాప్‌నకు పాల్పడినట్లు ప్రవీణ్ తెలిపాడు. బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్.. కొంత కాలం కిత్రం ఓ ప్రైవేటు కంపెనీలో టెలీకాలర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత, తన గర్ల్ ఫ్రెండ్‌కు విలువైన గిఫ్ట్‌లు ఇవ్వడానికి దొంగగా మారాడు. ఈ క్రమంలో గతంలో రెండు చోట్ల బైకులు దొంగతనాలు చేశాడు.

ఈ సారి అధిక మెత్తంలో డబ్బులు సంపాదించడానికి ఏకంగా చిన్నారిని కిడ్నాప్ చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కాగా, ప్రవీణ్ సొంతూరు శ్రీకాకుళం జిల్లా కేరమండలం మండల్, తుర్కపేట గ్రామం. గత కొన్ని సంవత్సరాల కిత్రం నగరానికి వలస వచ్చిన ప్రవీణ్ కుటుంబం రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముంటోంది. ప్రవీణ్ తండ్రి అప్పల స్వామి స్థానికంగా టైలర్‌గా పని చేస్తుంటాడు. విలాసాలకు, చెడు అలవాట్లకు అలవాటుపడిన ప్రవీణ్ దొంగగా మారాడు.

English summary
Hyderabad Police traced Borabanda Child Kidnap case on Monday. And Arrested five Kidnappers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X