పెళ్లిళ్లు, విడాకులు: బయటపడ్డ కి'లేడీ' డాక్టర్ బాగోతం, పుణే వ్యక్తితో సంబంధం పెట్టుకొని..
హైదరాబాద్: 37 ఏళ్ల హోమియోపతి మహిళా వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఆమె తన మూడో భర్త పైన వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇప్పుడు ఆమెను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
డాక్టర్ కావాలనుకొని.. వివాహిత మృతి: టెక్కీ భర్తపై అనుమానాలు
ఆమె పేరు సరిత. ఈమె గురించి ఆ తర్వాత ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భర్తపై కేసు పెట్టడం, వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేయడం.. ఇదీ ఆమె బాగోతం.

12 ఏళ్లలో ముగ్గుర్ని పెళ్లాడింది
ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం మూడో భర్త పైన వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కోర్టు నుంచి విడాకులు తీసుకొని, మరో పెళ్లి చేసుకొని, వారిని కూడా అలాగే చేస్తుంది. ఈమె తార్నాకకు చెందిన హోమియోపతి డాక్టర్. 12 ఏళ్లలో ముగ్గురిని వివాహం చేసుకొని భర్తలను పీడించింది. రాచకొండ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. జ్యూడిషియల్ రిమాండుకు తరలించారు.

మొదటి పెళ్లి
2005 ఫిబ్రవరి 11న హుబ్లీకి చెందిన రామానంద్ శంకర్‌ను పెళ్లాడింది. అనంతరం అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. అతని నుంచి రూ.6 లక్షలు, 20 తులాల బంగారం వచ్చాక.. 2010 అక్టోబర్ 22న కోర్టు ద్వారా విడాకులు పొందింది.

రెండో పెళ్లి
2011 మార్చి 18న చందానగర్‌కు చెందిన వెంకట రాంబాబును పెళ్లి చేసుకుంది. నెల రోజులకే అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కేసు పెట్టింది. వారి నుంచి రూ.9 లక్షలు అందిన తర్వాత కోర్టు నుంచి విడాకులు పొందింది.

మూడో పెళ్లి... బాగోతం ఇలా బయటపడింది
2015 డిసెంబర్ 27వ తేదీన సరిత వనస్థలిపురంకు చెందిన ప్రకాశ్ రావును పెళ్లాడింది. ఇతని పైన కూడా అదనపు కట్నం కేసు పెట్టింది. పోలీసులు ప్రకాశ్ రావును అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం బెయిల్ పైన వచ్చిన ప్రకాశ్ రావు.. సరిత గురించి ఆరా తీశారు. దీంతో సరిత బాగోతం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసారు.

పుణే వ్యక్తితో సంబంధం
సరిత 2015లో పుణేకు చెందిన వీరేందర్‌తో సంబంధం ఎర్పరుచుకొని నెల రోజుల పాటు సన్నిహితంగా మెలిగింది. అయితే తనను నమ్మించి మోసం చేశాడంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని నుంచి కూడా రూ.80వేలు వసూలు చేసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!