హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ఈవ్ టీజింగ్ చేస్తూ మళ్లీ మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసు నమోదు చేస్తామని షీ టీమ్స్ ఇన్‌చార్జి, ఏసీపీ స్వాతిలక్రా హెచ్చరించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 80 మందిపై షీ టీమ్స్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇందులో 16 మందిని కోర్టులో హాజరుపర్చగా.. ఇద్దరికి మూడు రోజులు, ఆరుగురికి రెండు రోజుల పాటు జైలు శిక్ష పడిందన్నారు. మిగతావారికి న్యాయస్థానం జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ వారిలో 17 ఏళ్ల వయ స్సు నుంచి 35 ఏళ్ల వయసు వారు ఉన్నారని చెప్పారు.

షీ టీమ్స్ పనితీరుపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. టీజింగ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను ఏర్పాటు చేశామని, త్వరలోనే షార్ట్‌ఫిలిమ్స్‌ను అందుబాటులోకి తెచ్చి అవగాహన కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై ప్రభుత్వం మరితంగా దృష్టి సారించింది. క్యాబ్, ఆటో డ్రైవర్లుగా మహిళలను దింపితే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణాశాఖ, పోలీస్‌శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

ఐతే క్యాబ్‌లు, ఆటోలు నడపడంలో శిక్షణ నిచ్చి షీ క్యాబ్స్, షీ ఆటోలను రోడ్డుపైకి తేవడం వల్ల మహిళల రక్షణలో సత్ఫలితాలు సాధిస్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఆడ వారికి క్యాబ్‌లు, ఆటోల డ్రైవింగ్‌లో ప్రభుత్వ పరంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రెండు మూడు నెలల పాటు శిక్షణ నిచ్చి, ప్రభుత్వం నుంచి సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణాలు ఇప్పించి షీ క్యాబ్స్‌ను, షీ ఆటోలను రోడ్డు పైకి తేవడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

మహిళలు నడిపే క్యాబ్‌లు, ఆటోలలో ఆడ వారికే ప్రయాణించే అవకాశం కల్పించాలని, అవసరమైతే ఎవరైనా పోకిరిలు వారిని అల్లరి చేసే పరిస్థితి ఉంటే నలుగురైదుగురిని ఎదుర్కొనే శక్తి ఉండేలా శిక్షణ ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. నిరంతరం నిఘా ఉంటున్నా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, సంఘటన జరిగిన స్థలానికి క్షణాల్లో చేరుకునేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తెచ్చినా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

 షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

క్యాబ్, ఆటో డ్రైవర్లుగా మహిళలను దింపితే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణాశాఖ, పోలీస్‌శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

 షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

ఐతే క్యాబ్‌లు, ఆటోలు నడపడంలో శిక్షణ నిచ్చి షీ క్యాబ్స్, షీ ఆటోలను రోడ్డుపైకి తేవడం వల్ల మహిళల రక్షణలో సత్ఫలితాలు సాధిస్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ టీమ్ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ప్రదర్శిస్తున్న దృశ్యం.

 షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

ఇందుకోసం ఆడ వారికి క్యాబ్‌లు, ఆటోల డ్రైవింగ్‌లో ప్రభుత్వ పరంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రెండు మూడు నెలల పాటు శిక్షణ నిచ్చేలా ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

ప్రభుత్వం నుంచి సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణాలు ఇప్పించి షీ క్యాబ్స్‌ను, షీ ఆటోలను రోడ్డు పైకి తేవడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

మహిళలు నడిపే క్యాబ్‌లు, ఆటోలలో ఆడ వారికే ప్రయాణించే అవకాశం కల్పించాలని, అవసరమైతే ఎవరైనా పోకిరిలు వారిని అల్లరి చేసే పరిస్థితి ఉంటే నలుగురైదుగురిని ఎదుర్కొనే శక్తి ఉండేలా శిక్షణ ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ

షీ క్యాబ్స్, షీ ఆటోలతో మహిళలకు రక్షణ


నిరంతరం నిఘా ఉంటున్నా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, సంఘటన జరిగిన స్థలానికి క్షణాల్లో చేరుకునేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తెచ్చినా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

English summary
The program of SHE teams was launched on 24th October, 2014 with the aim of curbing eve teasing in all aspects, in all forms, at all places, providing safety and security to women in the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X