హైదరాబాద్ నుంచి సింగపూర్ విమానాలు పెంపు, బోయింగ్ కూడా
హైదరాబాద్: సింగపూర్ దేశంలోనూ భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచే సింగపూర్ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు. అక్కడే స్థిరపడిన వారి సంఖ్యలో దక్షిణాదివాసులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సింగపూర్ దేశానికి హైదరాబాద్ నుంచి విమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది సింగపూర్ ఎయిర్‌లైన్స్.
హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. అంతేగాక, ఇందుకు బోయింగ్ 737-8 విమానాలను కూడా వినియోగిస్తామని సింగపూర్ ఎయిర్ లైన్స్ పేర్కొంది.

ఎకానమీలో 144 సీట్లు, బిజినెస్ క్లాసులో 10 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి సర్వీసులకు ఎయిర్ బస్ విమానాలను ఉపయోగిస్తామని తెలిపింది. వీటిలో 303 సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్‌లో 40, ఎకానమీలో 263 సీట్లు ఉంటాయని సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ జీఎం సై యెన్ చెన్ వెల్లడించారు. అక్టోబర్ 29 నుంచి 96 వీక్లీ ఫ్లైట్లను హైదరాబాద్ సమా తొమ్మిది నగరాల నుంచి నడుపుతామని తెలిపారు.
అయితే, స్కూట్ విమానాలు ఇక మీదట హైదరాబాద్ నుంచి ఉండవని, ఇతర నగరాల నుంచి సేవలు అందిస్తాయన్నారు. ప్రస్తుతం వారానికి ఏడు సర్వీసులు నడుస్తుండగా.. అక్టోబర్ 29వ తేదీ నుంచి మరో ఐదు సర్వీసులు పెంచుతామని సింగపూర్ ఎయిర్ లైన్స్ కంపెనీ జీఎం తెలిపారు. సంస్థ అనుబంధ విభాగం స్కూట్ రోజువారీ సర్వీసులను నిలిపివేసిన క్రమంలో ఈ సర్వీసుల పెంపు సానుకూలంగా మారనుంది.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications