ప్రేమోన్మాది ఘాతుకం: ఇంటికెళ్లి లేడీ టెక్కీ గొంతుకోశాడు, బాధితురాలికి బండి సంజయ్ పరామర్శ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని హైదర్‌షాకోట్ లక్ష్మీనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉంది.
హైదర్‌షాకోట్‌లోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్న షారుక్‌సల్మాన్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో బాధిత యువతితో పరిచయం పెంచుకున్న షారుక్.. ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు.

మంగళవారం సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన షారుక్.. ఆమెపై కూరగాయలు తరిగే కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌ను నిందితుడు షారుక్ కత్తితో బెదిరించి పరారయ్యాడు. అయితే, స్థానికులు నిందితుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ప్రేమ పేరుతో తమ కుమార్తెపై షారుక్ వేధిస్తున్నాడంటూ యువతి తండ్రి గతంలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతితో షారుక్ సల్మాన్‌కు రెండేళ్ల నుంచి పరిచయం ఉందని డీసీపీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.
కాగా, బాధిత యువతి గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రేమోన్మాది దాడిలో బాధితురాలి తల్లికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధిత యువతి పరిస్థితి కొంత నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications