చికెన్ కర్రీలో అది చూసి షాక్ తిన్నాడు: హైదరాబాద్ హోటల్లో చేదు అనుభవం..
నగరంలోని ఓ హోటల్లో చికెన్ కర్రీలో స్పాంజి ముక్కలు రావడం కలకలం రేపింది.
హైదరాబాద్: ఇటీవల జీహెచ్ఎంసీ తనఖీల్లో నగరానికి చెందిన చాలా హోటళ్లలో కుళ్లిపోయిన మాంసంతో బిర్యానీలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలోని ఓ హోటల్లో చికెన్ కర్రీలో స్పాంజి ముక్కలు రావడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్లో భోజనం చేయడానికి వెళ్లాడో వ్యక్తి. రైస్‌తో పాటు చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాడు. ప్లేటులో కర్రీ వేసుకుని తింటుండగా.. అందులో అతనికి స్పాంజి ముక్క కనిపించింది. దీంతో హోటల్ సూపర్ వైజర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో క్షమాపణలు చెప్పిన హోటల్ యాజమాన్యం విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్తపడింది.












Click it and Unblock the Notifications